HOME » NEWS » jobs » ANDHRA PRADESH STATE BEVERAGES CORPORATION LIMITED APSBCL INVITES APPLICATIONS FOR 9267 SALESMAN AND SALES SUPERVISOR POSTS APPLY BEFORE AUGUST 25 SS

Jobs: ఇంటర్, డిగ్రీ పాసైన వారికి 9267 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు

APSBCL Recruitment 2019 | కేవలం పురుషులకు కేటాయించిన పోస్టులివి. 21 నుంచి 40 ఏళ్లలోపు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

news18-telugu
Updated: August 23, 2019, 2:24 PM IST
Jobs: ఇంటర్, డిగ్రీ పాసైన వారికి 9267 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు
Jobs: ఇంటర్, డిగ్రీ పాసైన వారికి 9267 ఉద్యోగాలు... దరఖాస్తుకు 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
సేల్స్‌మెన్, సేల్స్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్-APSBCL దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. 13 జిల్లాల్లో 9267 ఖాళీలున్నాయి. కాంట్రాక్ట్ లేదా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులివి.  దరఖాస్తుకు ఆగస్ట్ 25 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు APSBCL అధికారిక వెబ్‌సైట్‌ apsbcl.aponline.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. సేల్స్ సూపర్‌వైజర్ ఉద్యోగానికి డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. బీకామ్ చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. సేల్స్‌మెన్ పోస్టుకు ఇంటర్ పాసవ్వాలి. ఇవి ఒక ఏడాది పోస్టులు మాత్రమే. కేవలం పురుషులకు కేటాయించిన పోస్టులివి. 21 నుంచి 40 ఏళ్లలోపు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఖాళీలు, అర్హతల వివరాలు పూర్తిగా తెలుసుకోవాలి.











































































 జిల్లా  సేల్స్‌మెన్  సేల్స్ సూపర్‌వైజర్
 అనంతపురం  495  198
 చిత్తూర్  860  344
 తూర్పు గోదావరి  1080  432
 గుంటూరు 705  282
 కృష్ణా  690  277
 కర్నూలు  410  164
 ప్రకాశం  660  264
 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు  700  280
 శ్రీకాకుళం  413  191
 విశాఖపట్నం  1000  401
 విజయనగరం 420  168
 పశ్చిమగోదావరి  835  379
 వైఎస్ఆర్ కడప 510   205

కాంట్రాక్ట్ పద్ధతిలో సేల్స్‌మెన్, సేల్స్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి జిల్లాల వారీగా వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్-APSBCL. వాటి కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Scholarship: విద్యార్థులకు స్కాలర్‌షిప్... దరఖాస్తుకు ఆగస్ట్ 28 చివరి తేదీ

MIB Recruitment: కేంద్ర సమాచార శాఖలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

IACS Jobs: జూనియర్ ఇంజనీర్, మల్టీ టాస్కింట్ స్టాఫ్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
Published by: Santhosh Kumar S
First published: August 23, 2019, 2:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading