ఏపీలో స్కూళ్ల ప్రారంభంపై విద్యాశాఖ మార్గదర్శకాలు.. క్లాస్ రూమ్‌లో ఎంత మంది ఉండాలంటే..

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాఠశాల ప్రారంభంపై విద్యాశాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది.

news18-telugu
Updated: October 31, 2020, 7:09 AM IST
ఏపీలో స్కూళ్ల ప్రారంభంపై విద్యాశాఖ మార్గదర్శకాలు.. క్లాస్ రూమ్‌లో ఎంత మంది ఉండాలంటే..
ఏపీలో స్కూళ్ల ప్రారంభానికి మార్గదర్శకాలు విడుదల
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాఠశాల ప్రారంభంపై విద్యాశాఖ పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు ఈ మార్గదర్శకాలు వర్తించనున్నాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు, టీచర్లకు ఇబ్బందుకుల కలగకుండా చర్యలు చేపడుతున్నారు. టెన్త్ క్లాస్ మినహా మిగిలిన విద్యార్థులకు రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించనున్నారు. అయితే టీచర్లు మాత్రం రోజు స్కూళ్లకు రావాల్సి ఉంటుంది. ఇక, ఒక్కొ విద్యార్థికి మధ్య 6 అడుగుల దూరం ఉండేలా క్లాస్ రూమ్‌ల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించకుండా ఉంచాలని నిర్ణయించారు. నవంబర్ నెల మొత్తం హాఫ్ డే మాత్రమే స్కూళ్లను నిర్వహిస్తారు. అంటే ఉదయం 9 నుంచి 1.30 వరకు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం ముగిశాక వారిని ఇంటి పంపిస్తారు.

ఇక, మొత్తంగా మూడు దశల్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. తొలుత నవంబర్ 2 నుంచి 9, 10, ఇంటర్మీడియట్ విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రారంభంలో 9వ తరగతికి ఒకరోజు క్లాసులు పెడితే మరునాడు 10వ తరగతి పిల్లలకు క్లాసులు పెట్టాల్సి ఉంటుంది.అయితే హాస్టళ్లు, రెసిడెన్షియల్ సూళ్లను అక్కడి వసతిని బట్టి నిర్ణీత నిబంధనలు పాటిస్తూ 9 నుంచి 12 తరగుతుల విద్యార్థులతో నవంబర్ 2 నుంచి ప్రారంభించవచ్చు. నిబంధనలు అనువుగా లేకపోతే.. నవంబర్ 23 నుంచి వాటిని ప్రారంభించాలి. ఆ లోపే విద్యార్థులు సమీప ప్రభుత్వ స్కూళ్లలో గానీ, ఆన్‌లైన్ క్లాసులకు గానీ హాజరయ్యేలా చూసుకోవాలి.

రెండో విడతలో భాగంగా.. నవంబర్ 23న 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభం అవుతాయి. అప్పటి నుంచి 6,8 తరగతులకు ఒకరోజు, 7,9 తరగతులకు మరుసటి రోజు తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయనున్నారు. అఖరిగా డిసెంబర్ 14 నుంచి ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు కూడా తరగతులు ప్రారంభం కానున్నాయి. అప్పటి నుంచి 1,3,5,7,9 తరగతులకు ఒకరోజు, 2,4,6,8 తరగతులకు మరసటి రోజు తరగతులు నిర్వహించాలి.

ఇక, స్కూళ్లకు హాజరయ్యే విద్యార్ధులు మాస్క్ ధరించేలా, భౌతిక దూరం పాటించేలా చూడాలి. అలాగే ప్రతి రోజు స్కూ్ళ్లను పరిశుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు మధ్యాహ్న బోజనం అందించే సమయంలో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
Published by: Sumanth Kanukula
First published: October 31, 2020, 6:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading