Home /News /jobs /

Jobs in Nellore: నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Jobs in Nellore: నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

Jobs in Nellore: నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Nellore: నెల్లూరు జిల్లాలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Andhra Pradesh Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఖాళీల వివరాలతో పాటు దరఖాస్తు విధానం (Application Process) గురించి తెలుసుకోండి.

    ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నెల్లూరు జిల్లాలో ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఫోరెన్సిక్ స్పెషలిస్ట్, జనరల్ ఫిజీషియన్, ఆడియోమెట్రిషియన్, మెడికల్ ఆఫీసర్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 5 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 5 చివరి తేదీ. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నెల్లూరు జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి ఆఫీసులో అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి. దరఖాస్తు ఫామ్‌తో పాటు సర్టిఫికెట్స్ కూడా జత చేయాలి.

    ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు నోటిఫికేషన్ల ద్వారా 2,213 పోస్టుల్ని భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ నోటిఫికేషన్ ద్వారా 1317 పోస్టుల్ని భర్తీ చేస్తుండగా, మరో నోటిఫికేషన్ ద్వారా 896 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. తాజా జాబ్ నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

    Jobs in TCS: డిగ్రీ పాస్ అయినవారికి మరో ఛాన్స్... టీసీఎస్‌లో ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు

    Andhra Pradesh Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...



































    మొత్తం ఖాళీలు 5 విద్యార్హతలు వేతనం
    ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ 1 ఎంబీబీఎస్‌తో పాటు ఫోరెన్సిక్ మెడిసిన్‌లో ఎండీ పాస్ కావాలి. రూ.1,10,000
    జనరల్ ఫిజీషియన్ 1 ఎంబీబీఎస్‌తో పాటు జనరల్ ఫిజీషియన్‌లో ఎండీ పాస్ కావాలి. రూ.1,10,000
    ఆడియోమెట్రిషియన్ 2 ఆడియాలజీ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ కావాలి. రూ.21,000
    మెడికల్ ఆఫీసర్ 1 ఎంబీబీఎస్ పాస్ కావాలి. రూ.53,495

    DRDO Recruitment 2021: డీఆర్‌డీఓలో 61 పోస్టులు... ఖాళీల వివరాలు ఇవే

    Andhra Pradesh Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 30

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటలు

    విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

    వయస్సు- 2021 జూలై 31 నాటికి ఓసీ అభ్యర్థులకు 42 ఏళ్ల లోపు, ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులకు 47 ఏళ్ల లోపు, ఎక్స్‌సర్వీస్‌మెన్, దివ్యాంగులకు 50 ఏళ్ల లోపు ఉండాలి.

    దరఖాస్తు ఫీజు- ఓసీ అభ్యర్థులకు రూ.500. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులకు రూ.200.

    ఈ జాబ్ నోటిఫికేషన్‌తో పాటు అప్లికేషన్ ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    UPSC Recruitment 2021: రూ.2,18,000 వేతనంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

    Andhra Pradesh Recruitment 2021: దరఖాస్తు విధానం


    Step 1- ఆసక్తిగల అభ్యర్థులు https://spsnellore.ap.gov.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేయాలి.

    Step 2- నోటిఫికేషన్‌లో దరఖాస్తు ఫామ్ ఉంటుంది. ప్రింట్ తీసుకోవాలి.

    Step 3- దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి టెన్త్, ఇంటర్ మెమోలతో పాటు క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికెట్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్ కాపీలు జత చేయాలి.

    Step 4- DM&HO, Nellore పేరుతో డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొని జత చేయాలి.

    Step 5- పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్‌ను DISTRICT MEDICAL & HEALTH OFFICER, NELLORE అడ్రస్‌లో అందజేయాలి.

    Step 6- 2021 డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు ఫామ్‌ను అభ్యర్థి స్వయంగా అందజేయాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Andhra pradesh news, AP News, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, Nellore, State Government Jobs, Telugu news, Telugu varthalu

    తదుపరి వార్తలు