Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రేపు గుడ్ న్యూస్

APPSC Exam Calendar 2020 | ఎగ్జామ్ క్యాలెండర్‌లో ఎగ్జామ్ పేరు, నోటిఫికేషన్ తేదీ, దరఖాస్తుకు ముఖ్యమైన తేదీలు, ప్రిలిమనరీ, మెయిన్ ఎగ్జామ్ తేదీలు ఉంటాయి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఎంతో మేలు చేస్తుంది.

news18-telugu
Updated: December 31, 2019, 1:16 PM IST
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రేపు గుడ్ న్యూస్
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు రేపు గుడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 1న శుభవార్త చెప్పనుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-APPSC జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే అవకాశముంది. అంటే 2020 సంవత్సరంలో ఏఏ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతాయన్న వివరాలను వెల్లడించనుంది. జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్టోబర్‌లోనే ప్రకటించారు. జనవరి 1న ఏపీపీఎస్సీ ఎగ్జామ్ క్యాలెండర్ 2020 రిలీజ్ చేయనుంది. ఎగ్జామ్ క్యాలెండర్‌లో ఎగ్జామ్ పేరు, నోటిఫికేషన్ తేదీ, దరఖాస్తుకు ముఖ్యమైన తేదీలు, ప్రిలిమనరీ, మెయిన్ ఎగ్జామ్ తేదీలు ఉంటాయి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఎంతో మేలు చేస్తుంది. ఏఏ పరీక్షలు ఎప్పుడు ఉంటాయో ముందే పూర్తి సమాచారం ఉంటుందని కాబట్టి... వాటికి తగ్గట్టుగా అభ్యర్థులు తమ ఎగ్జామ్ ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకుంటారు.

అంతేకాదు... ఏపీపీఎస్సీ నిర్వహించబోయే నియామక ప్రక్రియలో పరీక్షలు మాత్రమే ఉంటాయని, ఇంటర్వ్యూలు ఉండవని ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీ పరీక్షల్ని పారదర్శకంగా నిర్వహించేందుకు యూపీఎస్సీ, ఎస్ఎస్‌సీ, ఐబీపీఎస్, ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లతో కలిసి పనిచేస్తోంది ఏపీపీఎస్సీ. 2020 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టి ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఇంటర్వ్యూలు ఉండవు. ఇక ఇప్పటికే పలు నియామక పరీక్షల్ని ఫిబ్రవరి, మార్చికి రీషెడ్యూల్ చేసింది ఏపీపీఎస్సీ.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ.8,199 ధరకే నోకియా 2.3 సేల్... ఫోన్ ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

BECIL Recruitment 2020: గుడ్ న్యూస్... 4,000 పోస్టులతో జాబ్ నోటిఫికేషన్Railway Jobs: రైల్వే ఉద్యోగం మీ కలా? ఈ పరీక్ష రాయాల్సిందే

Work From Home: 'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో వల... మోసం చేస్తారు ఇలా
First published: December 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు