హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Post Office Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు... ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే

Post Office Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు... ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే

Post Office Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు... ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Post Office Jobs: ఆంధ్రప్రదేశ్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు... ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే (ప్రతీకాత్మక చిత్రం)

Post Office Jobs | పోస్ట్ ఆఫీస్ జాబ్స్ కోరుకునేవారికి అలర్ట్. ఆంధ్రప్రదేశ్‌లో పలు ఖాళీల భర్తీకి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  ఆంధ్రప్రదేశ్‌లోని పోస్ట్ ఆఫీసుల్లో పలు ఖాళీలను భర్తీ చేసేందుకు ఇండియా పోస్ట్ (India Post) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటాలో (Sports Quota) పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 75 ఖాళీలు ఉన్నాయి. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 27 చివరి తేదీ. పలు క్రీడల్లో రాణించినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కాబట్టి విద్యార్హతలతో పాటు క్రీడార్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఇతర వివరాలు, ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోండి.

  Andhra Pradesh Postal Jobs: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఖాళీలు75
  పోస్టల్ అసిస్టెంట్19
  సార్టింగ్ అసిస్టెంట్4
  పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్3
  పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్4
  పోస్ట్‌మ్యాన్18
  మల్టీ టాస్కింగ్ స్టాఫ్27


  IOCL Recruitment 2021: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 1968 పోస్టులు... ఇలా అప్లై చేయండి

  Andhra Pradesh Postal Jobs: ప్రాంతాల వారీగా ఖాళీల వివరాలు ఇవే...


   మొత్తం ఖాళీలు 75
   అనంతపూర్ 2
   కడప 1
   కర్నూలు 2
   నంద్యాల 1
   తిరుపతి 4
   భీమవరం 2
   ఏలూరు 2
   గుడివాడ 2
   గుంటూరు 2
   మచిలీపట్నం 2
   నరసరావుపేట 2
   నెల్లూరు 1
   ప్రకాశం 2
   తెనాలి 3
   తాడేపల్లిగూడెం 1
   విజయవాడ 6
   అమలాపురం 1
   అనకాపల్లె 2
   కాకినాడ 3
   రాజమండ్రి 2
   శ్రీకాకుళం 1
   విశాఖపట్నం 3
   విజయనగరం 1
   ఆర్ఎంఎస్ ఏజీ డివిజన్ 2
   ఆర్ఎంఎస్ టీపీ డివిజన్ 4
   ఆర్ఎంఎస్ వై డివిజన్ 7
   పీఎస్‌డీ, విజయవాడ 2
   పీఏ (సీఏ/ఆర్ఓ) 3
   పీఏ (ఎస్‌బీసీఏ) 4


  Ayush Recruitment 2021: ఆయుష్ శాఖలో ఉద్యోగాలు... రూ.70,000 వరకు వేతనం

  Andhra Pradesh Postal Jobs: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 27

  విద్యార్హతలు- టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. తెలుగు భాష తెలిసి ఉండాలి.

  క్రీడార్హతలు- ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చెస్, బాస్కెట్ బాల్, కబడ్డీ, క్యారమ్ లాంటి క్రీడల్లో రాణించినవారై ఉండాలి. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని ఉండాలి.

  వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

  వేతనం- పోస్టల్ అసిస్టెంట్‌కు రూ.25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,000, పోస్ట్‌మ్యాన్‌కు రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు రూ.18,000 బేసిక్ వేతనంతో మొత్తం రూ.56,900 వేతనం లభిస్తుంది.

  ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS, Telugu news, Telugu varthalu

  ఉత్తమ కథలు