AP Polycet Results 2019: ఏపీ పాలిసెట్ 2019 ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా

AP Polycet Results 2019 | పాసైనవారికి మే 24 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.

news18-telugu
Updated: May 9, 2019, 1:09 PM IST
AP Polycet Results 2019: ఏపీ పాలిసెట్ 2019 ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా
AP Polycet Results 2019: ఏపీ పాలిసెట్ 2019 ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 9, 2019, 1:09 PM IST
ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-ఏపీ పాలీసెట్ 2019 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ జీఎస్ పండదాస్ ఫలితాలను విడుదల చేశారు. ఏపీ పాలీసెట్ 2019 పరీక్షలో 1,24,899 మంది పరీక్షకు హాజరైతే వారిలో 1,05,329 మంది విద్యార్థులు పాసయ్యారు. 84,546 బాలురు హాజరైతే 70,051 మంది పాసయ్యారు. 40,353 మంది బాలికలు హాజరైతే 35,276 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 84.33. మొత్తం 120 మార్కులకు 36 మార్కులు వస్తే ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు తెలిపారు. క్వాలిఫై అయిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ర్యాంక్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2019 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకోండి.

Read this: Career Guidance: టెన్త్ తర్వాత ఏం చదవాలి? తెలుసుకోండి

AP Polycet Results 2019: చెక్ చేసుకోండి ఇలా



ముందుగా myap.e-pragati.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో 'Download Rank Card' పైన క్లిక్ చేయండి.


మీ పాలీసెట్ 2019 హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి.
ఫలితాలు స్క్రీన్‌పైన కనిపిస్తాయి.
డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి.
ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
https://myap.e-pragati.in/Polycet/polycet.html

పాసైనవారికి మే 24 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 209 కళాశాలల్లో 75,791 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే 41 శాతం సీట్లు ఫిల్ అయ్యాయి. జూన్ 6 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయి.

Photos: గూగుల్ పిక్సెల్ 3ఏ, 3ఏ ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్స్ ఎలా ఉన్నాయో చూశారా?

ఇవి కూడా చదవండి:

IRCTC: రూ.33 కోసం 24 నెలల పోరాటం... ఓ కామన్ మ్యాన్ కథ ఇది

Alcohol Study: వామ్మో... మనవాళ్లు ఫుల్లుగా తాగేస్తున్నారుగా... షాకిస్తున్న రిపోర్ట్

SBI Flexi Deposit: ఈ డిపాజిట్‌ స్కీమ్‌తో మీకు లాభాలెన్నో...
First published: May 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...