ఏపీలో కానిస్టేబుల్(AP Constable) పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ కీ (Preliminary Key) విడుదలైంది. దీంతో పాటు.. నాలుగు సెట్ల ప్రశ్నాపత్రాలను కూడా అందుబాటులో ఉంచింది APSLPRB. ఆన్సర్ కీపై జనవరి 25న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను ఈమెయిల్ (Email) ద్వారా తెలిపాల్సి ఉంటుంది. మరే ఇతర విధానంలోనూ పంపే అభ్యంతరాలను పరిగణనలోకీ తీసుకోమని ఆంధ్రప్రదేవ్ పోలీస్ నియామక బోర్డు చైర్మన్ మనీష్ కుమార్ తెలిపారు. ప్రిలిమినరీ ఆన్సర్ కీ కొరకు అభ్యర్థులు ఇక్కడ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి.
ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన ఫలితాలను, అభ్యర్థులు OMR పత్రాలను రెండువారాల్లోగా అందుబాటులో ఉంచుతామని పోలీసు నియామక మండలి ప్రకటించింది. అంతే కాకుండా.. ఏపీలో కానిస్టేబుల్ పరీక్షకు 91 శాతం హాజరు అయినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ మనీష్ కుమార్ సిన్హా ప్రకటించారు . ప్రిలిమినరీ కీ విడుదల చేసిన బోర్డు అధికారులు అత్యంత త్వరలోనే ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.
వీటికి సంబంధించి తేదీలను కూడా త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. మొత్తం ఈ పోస్టులకు ఐదు లక్షలు మూడు వేల మంది అబ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. ఏపీ వ్యాప్తంగా పరీక్షకు 91 శాతం వరకు అభ్యర్థులు హాజరయ్యారన్నారు. 4,58,219 మంది పరీక్ష రాసినట్లు పేర్కొన్నారు. 45,268 మంది గైర్హజరయినట్లు ప్రెస్ నోట్ ద్వారా బోర్డు తెలియజేసింది.
ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 6100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను ఈ రోజు నిర్వహించారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 5.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 91 శాతానికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు 75 మంది పోటీపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 997 ఎగ్జామ్ సెంటర్లను ఈ పరీక్ష కోసం ఏర్పాడు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP Police, Ap police jobs, Constable jobs, JOBS