ఫార్మసీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫార్మసీ కౌన్సిల్ కీలక నిర్ణయం..

అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే అన్ని ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఉద్యోగ నియామకాల కోసం పెట్టుకునే దరఖాస్తుల్లో ఈ రిజిస్ట్రేషన్‌ వివరాలు తెలపాల్సి ఉంటుంది.

news18-telugu
Updated: June 6, 2020, 6:35 PM IST
ఫార్మసీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫార్మసీ కౌన్సిల్ కీలక నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఫార్మీసీ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ గుడ్ న్యూస్ చెప్పనుంది. ఫార్మసీలో డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు త్వరలో ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుకింగ్‌ సదుపాయాన్ని ప్రారంభిస్తామని ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌ స్పష్టం చేసింది. ఈనెల 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లోనే స్లాట్‌ బుకింగ్‌ సౌకర్యం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు జాతీయ విజ్ఞాన కేంద్రం అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు రిజిస్ట్రార్‌ రామ్మూర్తి పేర్కొన్నారు. అందుకోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే అన్ని ధ్రువపత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు ఉద్యోగ నియామకాల కోసం పెట్టుకునే దరఖాస్తుల్లో ఈ రిజిస్ట్రేషన్‌ వివరాలు తెలపాల్సి ఉంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. అయితే అత్యవసరమైన అభ్యర్థులకు ప్రస్తుతం నేరుగా వస్తే రిజిస్ట్రేషన్‌ చేస్తామని రిజిస్ట్రార్‌ స్పష్టం చేశారు.
Published by: Narsimha Badhini
First published: June 6, 2020, 6:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading