ఏపీలోని గ్రామీణ ప్రాంత మహిళలకు శుభవార్త. ఇటీవల ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అంగన్ వాడీ ఉద్యోగాల (Anganwadi Jobs) భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో జిల్లాలో ఉద్యోగాల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అనంతపురం జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్ వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 13ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు (Jobs) సంబంధించి ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
ఈ ప్రకటన ద్వారా మొత్తం 120 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అంగన్ వాడీ వర్కర్, మినీ అంగన్ వాడీ వర్కర్, అంగన్ వాడీ హెల్పర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్ పాసైన మహిళలు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.వయో పరిమితి విషయానికి వస్తే అభ్యర్థులు జులై 1 నాటికి 21 నుంచి 35 ఏళ్ల వయస్సు ఉండాలి.
AAI Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్స్ .. ఇలా దరఖాస్తు చేసుకోండి
వేతనాలు:
అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.11,500 వేతనం ఉంటుంది. మినీ అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.7 వేలు, అంగన్ వాడీ హెల్పర్ గా ఎంపికైన వారికి నెలకు రూ.7 వేల వేతనం ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.
దరఖాస్తు ప్రక్రియ:
- అభ్యర్థులు దరఖాస్తులను అనంతపురం జిల్లా అధికారిక వెబ్ సైట్ https://ananthapuramu.ap.gov.in/ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలి.
- దరఖాస్తులను పూర్తిగా నింపి సీపీడీవో కార్యాలయం, అనంతపురం జిల్లా చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
- దరఖాస్తులు ఈ నెల 13వ తేదీలోగా చేరేలా పంపించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.