Home /News /jobs /

ANDHRA PRADESH NOTIFICATION RELEASED FOR JOB VACANCIES AT MARA RAJA GROUP NOV 18 IS LAST DATE FOR APPLICATIONS NS

Jobs in AP: ఏపీలో టెన్త్, ఇంటర్ అర్హతతో AMARA RAJA Groupలో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ కు కొన్ని గంటలే ఛాన్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రముఖ అమర రాజా(Amara Raja) సంస్థలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ప్రముఖ అమర రాజా(AMARA RAJA) సంస్థలో ఖాళీల (Jobs) భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకోవడానికి ఈ నెల 18ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ (Jobs Registration) చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో(Job Notification) స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 20న తంబళ్లపల్లెలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు Apprenticeship విధానంలో పని చేయాల్సి ఉంటుంది.

    ఖాళీలు విద్యార్హతల వివరాలు:
    1. టెన్త్(పాస్/ఫెయిల్)/ఇంటర్ ఫెయిల్ అభ్యర్థులకు 50 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి మొదటి మూడు నెలలు రూ. 7500, తర్వాత 9 నెలలు రూ. 10,446 మరియు తర్వాత 12 నెలలు రూ. 10, 646 వేతనం చెల్లించనున్నారు.
    2. ఇంటర్ పాసైన వారి కోసం 50 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి మొదటి మూడు నెలల పాటు రూ. 7500, తర్వాత 9 నెలలు రూ.10, 646 వేతనం చెల్లించనున్నారు. తర్వాత 12 నెలల పాటు నెలకు రూ. 10, 846 వేతనం చెల్లించనున్నారు.
    వయో పరిమితి: ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి.
    NTPC Recruitment 2021: బీటెక్ చేసిన వారికి శుభవార్త.. రూ. 60 వేల వేతనంతో NTPCలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

    ఇతర వివరాలు: HR రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు చిత్తూరులోని అమర రాజా గ్రూప్ లో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి రాయితీపై భోజన, వసతి సదుపాయం ఉంటుంది.


    రిజిస్ట్రేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇంటర్వ్యూ వివరాలు: రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు Sri TNVSR M GOVT ITI., Main Bazar, Near Indian Bank, Thamballapalle, Chittor (Dist), Pincode 517418 చిరునామాలో ఈ నెల 20వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆ రోజు ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు ఇతర వివరాలకు 8500344358, 9700623179 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Apprenticeship, JOBS, Private Jobs, State Government Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు