Inter Admissions: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు

Inter Admissions | ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ స్కూల్స్‌లో ఇంటర్ అడ్మిషన్లు కోరుకునేవారికి గుడ్ న్యూస్. దరఖాస్తు గడువు పెరిగింది.

news18-telugu
Updated: July 31, 2020, 6:23 PM IST
Inter Admissions: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు
Inter Admissions: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు పెంచింది ఏపీ ప్రభుత్వం. మొదట ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేయడానికి 2020 జూలై 31 వరకే అవకాశం ఉంది. గడువు ముగుస్తుండటంతో చివరి తేదీని పొడిగిస్తున్నట్టు ఆదర్శ పాఠశాలల జాయింట్ డైరెక్టర్ వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు మోడల్ స్కూల్స్‌లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం 2020 ఆగస్ట్ 25 వరకు అప్లై చేయొచ్చు. ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 1న దరఖాస్తుల్ని పరిశీలించి ఆగస్ట్ 3న సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ నిర్వహించాలి. అదే రోజున తరగతుల్ని కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ ప్రస్తుతం దరఖాస్తు గడువును పొడిగించడంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్, తరగతులను ప్రారంభించే షెడ్యూల్ మొత్తం మారనుంది. ప్రస్తుతం దరఖాస్తుకు చివరి తేదీని మాత్రమే ప్రకటించారు. మిగతా షెడ్యూల్‌ను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 26,778 ఉద్యోగాలు... వారం రోజుల్లోనే భర్తీ

ONGC Jobs: ఓఎన్‌జీసీలో 4182 ఉద్యోగాలు... కాకినాడ, రాజమండ్రిలో ఖాళీలు

పదవ తరగతి పాసైన విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందొచ్చు. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన ఉంటుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో https://apms.apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.150, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100 చొప్పున చెల్లించాలి. దరఖాస్తు ప్రింట్ తీసుకొని కాపీని సంబంధిత ప్రిన్సిపాల్‌కు గడువులోగా సమర్పించాలి. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల్ని స్వీకరించరు. అన్ని వర్గాల్లో సీట్ల కేటాయింపులో 33.33 శాతం బాలికలకు కేటాయిస్తారు.
Published by: Santhosh Kumar S
First published: July 31, 2020, 6:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading