news18-telugu
Updated: August 6, 2020, 10:20 AM IST
AP Model School: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్‌లో అడ్మిషన్స్... దరఖాస్తు గడువు పెంపు
(ప్రతీకాత్మక చిత్రం)
ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ స్కూళ్లల్లో 6వ తరగతిలో అడ్మిషన్ల కోసం దరఖాస్తు గడువు పెరిగింది. వాస్తవానికి దరఖాస్తు ప్రక్రియ గతంలోనే ముగిసింది. కానీ అడ్మిషన్లకు అప్లై చేయడానికి మరో అవకాశం ఇచ్చేందుకు దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ వెల్లడించారు. తమ పిల్లలకు ఆదర్శ పాఠశాలలో 6వ తరగతిలో అడ్మిషన్లు కోరుకునే తల్లిదండ్రులు ఆగస్ట్ 25 వరకు అప్లై చేయొచ్చు. 2020-21 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో అడ్మిషన్స్ కోసం కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ ఇది. ఎంట్రెన్స్ టెస్ట్ లేకుండా లాటరీ ద్వారా విద్యార్థులకు 6వ తరగతిలో అడ్మిషన్లు కల్పిస్తారు. మోడల్ స్కూల్లో అడ్మిషన్లు పొందినవారు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆసక్తి గలవారు https://apms.apcfss.in/ వెబ్సైట్లో మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేసి దరఖాస్తుల్ని సంబంధిత ఆదర్శ పాఠశాలలోని ప్రిన్సిపాల్‌కు అందజేయాలి.
IBPS PO: ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చేసింది... డిగ్రీ అర్హతతో 1167 పోస్టులుJobs: కోల్‌ఫీల్డ్స్‌లో 512 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
AP Model School 6th Class Admissions: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం- 2020 జూలై 6
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 25
విద్యార్హత: 2019-20 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.వయస్సు: ఓసీ, బీసీ విద్యార్థులు 01-09-2008 నుంచి 31-08-2010 మధ్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01-09-2006 నుంచి 31-08-2010 మధ్య జన్మించినవారై ఉండాలి.
ఫీజు- ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50.
Published by:
Santhosh Kumar S
First published:
August 6, 2020, 10:20 AM IST