AP Model School: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్స్‌... దరఖాస్తు ప్రక్రియ మళ్లీ ప్రారంభం

Andhra Pradesh Model School Admissions | ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ మళ్లీ ప్రారంభమైంది. వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: July 6, 2020, 3:51 PM IST
AP Model School: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్స్‌... దరఖాస్తు ప్రక్రియ మళ్లీ ప్రారంభం
AP Model School: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్స్‌... దరఖాస్తు ప్రక్రియ మళ్లీ ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ స్కూళ్లల్లో తమ పిల్లల్ని చదివించాలనుకునే తల్లిదండ్రులకు శుభవార్త. అడ్మిషన్ ప్రక్రియ మళ్లీ మొదలైంది. 2020-21 విద్యాసంవత్సరంలో 6వ తరగతిలో అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వాస్తవానికి గతంలోనే దరఖాస్తుల్ని స్వీకరించారు. కానీ అడ్మిషన్ ప్రక్రియను వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేశారు. జూలై 6న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్ స్కూళ్లల్లో అడ్మిషన్లు ఉంటాయి. ఎంట్రెన్స్ టెస్ట్ లేకుండా లాటరీ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఆసక్తి గల విద్యార్థులు https://apms.apcfss.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 జూలై 25న ముగుస్తుంది. మోడల్ స్కూల్‌లో అడ్మిషన్లు పొందినవారు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.

Skill Training: గూగుల్, టీసీఎస్, ఫేస్‌బుక్ నుంచి విద్యార్థులకు ట్రైనింగ్

Top 10 Jobs: డిమాండ్ ఉన్న టాప్ 10 జాబ్స్ ఇవే... ఈ స్కిల్స్ మీకున్నాయా?

AP Model School 6th Class Admissions: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం- 2020 జూలై 6
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 25
విద్యార్హత: 2019-20 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.వయస్సు: ఓసీ, బీసీ విద్యార్థులు 01-09-2008 నుంచి 31-08-2010 మధ్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01-09-2006 నుంచి 31-08-2010 మధ్య జన్మించినవారై ఉండాలి.
ఫీజు- ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50.
Published by: Santhosh Kumar S
First published: July 6, 2020, 3:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading