Home /News /jobs /

ANDHRA PRADESH MODEL SCHOOL 6TH CLASS ADMISSION PROCESS BEGINS KNOW HOW TO APPLY FOR ENTRANCE EXAMINATION SS

AP Model School: ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్లలో అడ్మిషన్స్‌... దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh Model School 6th Class Admission | ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ స్కూళ్లల్లో అడ్మిషన్ల కోసం ఎంట్రెన్స్ టెస్ట్ 5వ తరగతి స్థాయిలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మోడల్ స్కూల్‌లో అడ్మిషన్లు పొందినవారు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ స్కూళ్లల్లో అడ్మిషన్లు కోరుకునే విద్యార్థులకు శుభవార్త. 2020-21 విద్యాసంవత్సరంలో 6వ తరగతిలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా కమిషనర్, ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూళ్ల ఎక్స్ అఫిషియో పీడీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్ స్కూళ్లల్లో అడ్మిషన్లు ఉంటాయి. ఇందుకోసం ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. 2020 ఏప్రిల్ 5న ఎంట్రెన్స్ టెస్ట్ రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు కేంద్రాల్లో జరుగుతుంది. ఆసక్తి గల విద్యార్థులు https://apms.ap.gov.in/apms/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ 2020 ఫిబ్రవరి 7న ముగుస్తుంది. ఎంట్రెన్స్ టెస్ట్ 5వ తరగతి స్థాయిలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మోడల్ స్కూల్‌లో అడ్మిషన్లు పొందినవారు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు.

    AP Model School 6th Class Admissions: గుర్తుంచుకోవాల్సిన తేదీలు ఇవే...


    నోటిఫికేషన్ విడుదల- 2020 జనవరి 8
    ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం- 2020 జనవరి 8
    దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఫిబ్రవరి 7
    ఎంట్రెన్స్ టెస్ట్- 2020 ఏప్రిల్ 5
    మెరిట్ లిస్ట్ వెల్లడి- 2020 ఏప్రిల్ 15
    సెలెక్షన్ లిస్ట్ ప్రచురణ- 2020 ఏప్రిల్ 16
    సర్టిఫికెట్ వెరిఫికేషన్ 2020 ఏప్రిల్ 17, 18
    ఓరియెంటేషన్ ప్రోగ్రామ్- 2020 ఏప్రిల్ 21, 22
    తరగతుల ప్రారంభం- 2020 జూన్ 12

    AP Model School 6th Class Admissions: అర్హతలు ఇవే...


    విద్యార్హత: 2019-20 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి.
    వయస్సు: ఓసీ, బీసీ విద్యార్థులు 01-09-2008 నుంచి 31-08-2010 మధ్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01-09-2006 నుంచి 31-08-2010 మధ్య జన్మించినవారై ఉండాలి.
    ఫీజు- ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50.
    నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేస్తోంది... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Railway Jobs: రైల్వేలో మరో 1785 ఉద్యోగాల భర్తీ... నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి

    SBI Jobs: ఎస్‌బీఐలో 7870 క్లర్క్ జాబ్స్... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

    Railway Jobs: గుడ్ న్యూస్... రైల్వేలో 3,553 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, Andhrapradesh, AP News, AP Schools, CAREER, EDUCATION, Job notification, NOTIFICATION, School admissions

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు