Home /News /jobs /

ANDHRA PRADESH MINISTER ADIMULAPU SURESH RELEASED APICET AND APECET RESULTS 2021 FULL DETAILS HERE PRN

AP ICET T Results-2021: ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో (MBA, MCA Cources) ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్-2021 (AP ICET Results-2021) ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (AP Education Minister Adimulapu Suresh) ఫలితాలను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్-2021 ఫలితాలు (AP ICET Results-2021) విడుదలయ్యాయి. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (AP Education Minister Aidmulapu Suresh) ఫలితాలను విడుదల చేశారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రకటించారు. ఐసెట్ ఫలితాల్లో 38వేల మంది హాజరవగా 34,789 మంది అంటే 91.27 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు ఫలితాల కోసం వెబ్ సైట్లో ఫలితాలు చూసుకోవచ్చని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఐసెట్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్ష నిర్వహించిన రెండు వారాల్లోపే రికార్డు స్థాయిలో ఫలితాలను ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. ఎంసెట్ పరీక్షల ఫలితాలు  (AP EAPCET Results) కూడా అంతే వేగంతో ఇచ్చామన్నారు.

    ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
    ఏపీ ఐసెట్ ఫలితాలను చెక్ చేసుకునేందుకు ప్రభుత్వం వెస్ సైట్ ఇచ్చింది. విద్యార్థులు www.sche.ap.gov.in రిజల్ట్స్ చూసుకోవచ్చని మంత్రి తెలిపారు. వెబ్ సైట్లోకి వెళ్లిన తర్వాత ఏపీ ఐసెట్-2021 ట్యాబ్ క్లిక్ చేసి అక్కడ అడ్మిట్ కార్డు నెంబర్, ఇతర వివరాలను ఎంటర్ చేస్తే ఫలితాలు చూసుకోవచ్చు. రేపటి నుంచి మార్క్స్ మెమోను వెస్ బైట్లో అందుబాటులో ఉంచుతామని మంత్రి తెలిపారు.

    ఇది చదవండి: ఏపీలో పెన్షన్ పోర్టబులిటీ.. ఇక నుంచి ఎక్కడైనా పెన్షన్ తీసుకోవచ్చు.. ఇలా చేయండి..


    ఐసెట్ లో త్వరలోనే అడ్మిషన్ల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. ఎక్కడా పొరబాట్లకు తావులేకుండా వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తి పారదర్శకతతో జరిగినట్లు ఆయన వెల్లడించారు. ఐసెట్ లో శ్రీకాకుళంకు చెందిన రామకృష్ణకు టాప్ ర్యాంక్ దక్కగా.. అనంతపురంకు చెందిన బండి లోకేష్ కి రెండో ర్యాంక్, విజయనగరంకు చెందిన వెంటేష్ కు మూడో ర్యాంక్, చిత్తూరు జిల్లాకు చెందిన అల్లి లిఖిత్ కు నాలుగో ర్యాంక్, చిత్తూరుకు చెందిన షేక్ అమియుల్లాకు ఐదో ర్యాంక్, ఆరో ర్యాంక్ సాయి మణికుమార్ చెన్నంకు దక్కినట్లు మంత్రి ప్రకటించారు. చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులకు టాప్-10లో నాలుగు ర్యాంకులు వచ్చినట్లు తెలిపారు. ఐసెట్ కీని కూడా విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.

    ఇది చదవండి: మార్కెట్లోకి కొత్తరకం పుచ్చకాయలు.. కిలో గింజలు రూ.30వేలు.. స్పెషాలిటీ ఇదే..!


    ఏపీఈసెట్ ఫలితాలు
    ఇంజనీరింగ్‌ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఏపీఈసెట్‌–2021 (ఏపీ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ఫలితాలను కూడా మంత్రి సురేషఅ విడుదల చేశారు. జేఎన్‌టీయూ(అనంతపురం) ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈసెట్‌ ఫలితాల్లో మొత్తం 32,318 హాజరవగా... 29,904 మంది విద్యార్థులు అంటే 92.53 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణతాశాతం నాలుగు శాతం తగ్గినట్లు మంత్రి తెలిపారు. మొత్తం 13 బ్రాంచులకు గాను పరీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌ సహా రాష్ట్రవ్యాప్తంగా 48 పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ నిర్వహించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap minister suresh, Exam results

    తదుపరి వార్తలు