హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP EAPCET-2021 Results: ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

AP EAPCET-2021 Results: ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET-2021) ఫలితాలు రిలీజ్ అయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET-2021) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. రిజల్ట్స్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) విడుదల చేశారు. ఇప్పటికే ఇంజనీరింగ్ ఫలితాలను (Engineering Results) ప్రకటించిన ఉన్నత విద్యామండలి (AP Higher education Council).. మంగళవారం అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలను (Agriculture and Pharmacy) విడుదల చేసింది. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాల్లో 83,822 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.., మొత్తం 78,066 మంది పరీక్షలు రాశారు. వీరిలో 72,488 అనగా 92.85 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి ప్రకటించారు. రికార్డు స్థాయిలో వారం రోజుల్లోనే ఫలితాలు వెల్లడించామని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఇంజనీరింగ్ ఫలిచాలు విడుదలైనందున ఈనెల 18 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్ సైట్ లో ఉంచింది. ఫలితాలను https://sche.ap.gov.in/EAPCET, https://sche.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను ఈ కింద ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులంతా ఈ లింకును క్లిక్ చేసిన తరువాత AP EAMCET 2021 ఫలితంపై క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ నంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఫలితాలు కనిపిస్తాయి. రిజల్ట్స్ షీట్ ను ఇదే వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఇది చదవండి: శ్రీవారి భక్తులకు కొత్త చిక్కులు... వారి అత్యుత్సాహంతో దర్శనానికి దూరం..


టాపర్స్ వీళ్లే.. ఏపీఈఏపీ సెట్-2021లో తూర్పుగోదావరి జిల్లా కొరుకొండకు చెందిన చందం విష్ణు వివేక్ 155.28శాతం మార్కులతో టాప్ ర్యాంక్ సాధించాడు. అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన రంగు శ్రీనివాస కార్తికేయ రెండో ర్యాంక్ సాధించగా.. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన బొల్లినేని విశ్వాస్ రావు మూడో ర్యాంక్, రంగారెడ్డి జిల్లా కూకట్ పల్లికి చెందిన గజ్జల సమీహా రెడ్డికి నాలుగో ర్యాంక్ సాధించాడు. హైదరాబాద్ ప్రగతినగర్ కు చెందిన కాసా లహరి ఐదో ర్యాంక్ సాధించింది.

ఇది చదవండి: కళ్ల ముందే నేషనల్ హైవే... కానీ వారు రోడ్డెక్కలేరు.. కారణం ఇదే..!


ఇక.. ఈ నెల 18 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభం చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈఏపీసెట్ ద్వారా ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బీటెక్‌ అగ్రి ఇంజనీరింగ్, బీఎస్సీ (హార్టికల్చర్‌), బీఎస్సీ (అగ్రి), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/ బీఎఫ్‌ఎస్సీ, బీ-ఫార్మసీ, ఫార్మా డీ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు. కాగా సెప్టెంబర్ 7వ తేదీన అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు నిర్వహించిన ఉన్నత విద్యాశాఖ రికార్డు స్థాయిలో వారం రోజుల్లోనే ఫలితాలను ప్రకటించింది.

First published:

Tags: Ap minister suresh, EDUCATION, Engineering, Exam results

ఉత్తమ కథలు