ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. విశాఖపట్నంలో ఈ ఏడాది 50,000 ఐటీ ఉద్యోగావకాశాలు కల్పించబోతున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అంతేకాదు... ఒక స్కిల్ యూనివర్సిటీ, 26 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, 4 కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌లు విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం 4 అంశాలపై అద్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ సూచించినట్టు మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు కావాల్సిన నిధులు, స్థలం, పాఠ్య ప్రణాళిక లాంటి అంశాలపై జగన్ ఆరా తీసినట్టు చెప్పారు.
విశాఖలో జరిగిన యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-UNIDO, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్-DoPT సదస్సు తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు మంత్రి గౌతమ్ రెడ్డి. విశాఖపట్నంలో యూనిట్స్ ఏర్పాటు చేసేందుకు ఐటీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని, ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. విశాఖపట్నం నుంచి అదానీ డేటా సెంటర్ తరలివెళ్లట్లేదని, మరో స్థలాన్ని మాత్రం కోరుతోందన్నారు. విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. మరింత ఎక్కువ పారదర్శకంగా సరికొత్త ఐటీ పాలసీని త్వరలో వెల్లడిస్తామన్నారు.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Andhra Pradesh Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు
Telangana Jobs: తెలంగాణలో 1466 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత
Railway Jobs: భారతీయ రైల్వేలో 2792 ఉద్యోగాలు... పోస్టుల వివరాలివేPublished by:Santhosh Kumar S
First published:February 19, 2020, 13:41 IST