హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Andhra Pradesh Jobs: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 3,393 ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌

Andhra Pradesh Jobs: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 3,393 ఉద్యోగాలు.. ప‌రీక్ష లేకుండానే ఎంపిక‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉద్యోగాలు

రాష్ట్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో 3,393 ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ (Contract Basis) మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (Mid-level Health Provider) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఎటువంటి ప‌రీక్ష లేకుండా అకాడ‌మిక్ మెరిట్ ద్వారానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి న‌వంబ‌ర్ 6, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ (Andhra Pradesh) ప్ర‌భుత్వం మ‌రో భారీ రిక్రూట్‌మెంట్‌కు రాష్ట్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. వైఎస్సార్‌ విలేజ్, వార్డు క్లినిక్స్‌లో వైద్య సేవలు అందించడానికి 3,393 ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ (Contract Basis) మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (Mid-level Health Provider) పోస్టుల భర్తీకి ప్ర‌భుత్వం శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టుల‌కు కేవ‌లం ఆన్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ప‌రీక్ష లేకుండా కేవ‌లం అకాడ‌మిక్ మెరిట్ (Academic Merit) ద్వారానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకొనేందుక అధికారిక వెబ్ సైట్‌ https://cfw.ap.nic.in/MLHP2021.html ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

  పోస్టుల వివ‌రాలు..

  జిల్లాలుపోస్టులు
  శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖప‌ట్నం633
  తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, కృష్ణ1,003
  గుంటూరు, ప్ర‌కాశం, నెల్లూరు786
  చిత్తూరు, క‌డ‌ప‌, అనంత‌పురం, క‌ర్నూలు971


  ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అర్హ‌త‌లు..

  - ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థి ఆంధ్రప్రదేశ్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి ఉండాలి.

  Harvard University: ఇంటి నుంచే "హార్వర్డ్‌"లో చ‌దివేయండి.. టాప్ ఫ్రీ ఆన్‌లైన్ కోర్సుల వివ‌రాలు 


  - నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీ నాటికి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు 35 ఏళ్లలోపు (బీసీ, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ 40 ఏళ్లలోపు) వయసు కలిగి ఉండాలి.

  ఎంపిక విధానం..

  Step 1 : ముంద‌గా పోస్టుల‌కు ద‌రఖాస్తు చేసుకోవాలి.

  Step 2 :  బీఎస్సీ నర్సింగ్‌ మార్కులు ఆధారంగా ఎంపిక ఉంటుంది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ల ప్రకారం పోస్టులు భర్తీ చేస్తారు

  Step 3 : అనంత‌రం కాంట్రాక్టు విధానంలో నియామకాలు ఉంటాయి. తొలుత ఏడాది పాటు కాంట్రాక్టు విధానంలో నియమిస్తారు. పనితీరు ఆధారంగా సర్వీసు కొనసాగిస్తారు.

  ద‌ర‌ఖాస్తు విధానం..

  Step 1 : ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది.

  Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://cfw.ap.nic.in/MLHP2021.html ను సంద‌ర్శించాలి.

  GMRC Recruitment 2021 : ఇంజ‌నీరింగ్ అర్హ‌త‌తో.. గుజరాత్ మెట్రోరైల్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.50,000


  Step 3 : అనంత‌రం నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చద‌వాలి.

  Step 4 : నోటిఫికేష‌న్ చ‌ద‌విని అనంత‌రం ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ఫాం కోసం https://ncdcd.ap.gov.in/mlhp_registrations_form/ లింక్‌లోకి వెళ్లాలి.

  Step 5 : ఆధార్ నంబ‌ర్‌, మొబైల్ నంబ‌ర్ ద్వారా రిజిస్ట్రేష‌న్ పూర్తి చేయాలి.

  Step 6 : అనంత‌రం పూర్తిగా అప్లికేష‌న్ ఫాం నింపాలి.

  Step 7 : ద‌ర‌ఖాస్తు పూర్త‌యిన త‌రువాత అప్లికేష‌న్ కాపీని ప్రింట్ తీసుకొని భ‌ద్ర ప‌రుచుకోవాలి.

  Step 8 : ద‌ర‌ఖాస్తుకు న‌వంబ‌ర్ 6, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Govt Jobs 2021, Health department jobs, Job notification, JOBS

  ఉత్తమ కథలు