Andhra Pradesh Job Mela: మొత్తం 730 పోస్టుల భర్తీకి విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు

Andhra Pradesh Jobs | విశాఖపట్నంలో నేడు, రేపు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. 10వ తరగతి నుంచి ఎంబీబీఎస్ వరకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నవారు పోస్టుల్ని బట్టి వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: February 25, 2020, 10:11 AM IST
Andhra Pradesh Job Mela: మొత్తం 730 పోస్టుల భర్తీకి విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు
Andhra Pradesh Job Mela: మొత్తం 730 పోస్టుల భర్తీకి విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. అరబిందో ఫార్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 730 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తీసుకొస్తున్న 104, 108 వాహనాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. వైద్యులు, సూపర్‌వైజర్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, పైలెట్ / డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులున్నాయి. విశాఖపట్నంలోని బుల్లయ్య కళాశాలలో ఈ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో జరిగే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు నేరుగా హాజరవ్వాల్సి ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల అభ్యర్థులు మాత్రమే ఈ ఇంటర్వ్యూలకు రావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలు, ఎక్స్‌పీరియెన్స్ సర్టిఫికెట్, చివరి మూడు నెలల పేస్లిప్స్, ప్రస్తుతం ఎక్కడైనా పనిచేస్తున్నట్టైతే ఐడీ కార్డ్స్ వాక్-ఇన్ ఇంటర్వ్యూకు తీసుకెళ్లాలి.

Andhra Pradesh Jobs: ఖాళీల వివరాలివే...



మొత్తం ఖాళీలు- 730
డాక్టర్- 200
సూపర్‌వైజర్- 30
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్- 150
పైలెట్ / డ్రైవర్- 300డేటా ఎంట్రీ ఆపరేటర్- 50

Andhra Pradesh Jobs: విద్యార్హతలు ఇవే...


డాక్టర్- ఎంబీబీఎస్
సూపర్‌వైజర్- ఎంబీఏ లేదా ఏదైనా డిగ్రీ
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్- బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీఎస్సీ ఎంఎల్‌టీ, జనరల్ నర్సింగ్ మిడ్‌వైఫ్
పైలెట్ / డ్రైవర్- 10వ తరగతి, లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్
డేటా ఎంట్రీ ఆపరేటర్- డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్స్. టైపింగ్ తెలిసి ఉండాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

SSC Recruitment 2020: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి 1157 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Andhra Pradesh Jobs: ఇంటర్, డిగ్రీ పాసైనవారికి ఆంధ్రప్రదేశ్‌లో 1502 ఉద్యోగాలు

Telangana Jobs: తెలంగాణలో 1466 ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ అర్హత
Published by: Santhosh Kumar S
First published: February 25, 2020, 10:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading