Jobs: Tech Mahindraలో ఉద్యోగాలు.. ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ, ఇంటి నుంచే పని చేసే ఛాన్స్.. రిజిస్ట్రేషన్ కు కొన్ని గంటలే గడువు

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహింద్రలో 500 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకనటలో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కు ఈ రోజే లాస్ట్ డేట్.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరంగా మారింది. సంస్థ నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. అనేక సందర్భాల్లో నిరుద్యోగులకు కావాల్సిన శిక్షణ అందించి సైతం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. తాజాగా సంస్థ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ప్రముఖ ఐటీ కంపెనీ టెక్ మహింద్ర(Tech Mahindra)లో 500 ఖాళీల భర్తీ కోసం APSSDC నుంచి ప్రకటన విడుదలైంది. హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
    Oil India Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
    BHEL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. బీహెచ్ఈఎల్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో మూడు రోజులే ఛాన్స్

    అర్హతల వివరాలు..
    కస్టమర్ సర్వీస్ అసోసియేట్ విభాగంలో ఈ నియామకలు చేపట్టారు. డిప్లొమో, డిగ్రీ, పీజీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 2015 నుంచి 2020 మధ్యలో పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.50 లక్షల వేతనం చెల్లించనున్నారు. అదనంగా షిఫ్ట్ అలవెన్స్ లు ఉంటాయి. అభ్యర్థులకు తెలుగు, ఇంగ్లిష్ భాషలు తెలిసి ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. అభ్యర్థులు ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ కలిగి ఉండాలి. ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి.
    Registration - Direct Link1
    Registration - Direct Link2



    ఇతర వివరాలు..
    ఎంపికైన అభ్యర్థులు చెన్నైలో పని చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం వర్క్ ఫ్రం హోంకు అవకాశం కల్పించారు. చిత్తూరు, తిరుపతి, పుత్తూరు ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. 2021లో పాసైన అభ్యర్థులు దరఖాస్తుకు అనర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 12లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 13న వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఇతర వివరాలకు 8121984014, 8309038348 నంబర్లను సంప్రదించవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: