• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • ANDHRA PRADESH JOBS APPLY FOR 16208 POSTS IN GRAMA SACHIVALAYAM AND WARD SACHIVALAYAM SS

Andhra Pradesh Jobs: ఏపీలో 16,208 జాబ్స్... అప్లై చేయండి ఇలా

Andhra Pradesh Jobs: ఏపీలో 16,208 జాబ్స్... అప్లై చేయండి ఇలా

Andhra Pradesh Jobs: ఏపీలో 16,208 జాబ్స్... అప్లై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Andhra Pradesh Sachivalayam Recruitment 2020 | ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఫాలో అవాల్సిన స్టెప్స్ గురించి తెలుసుకోండి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేయపట్టిన సంగతి తెలిసిందే. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 16,208 పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పంచాయత్ సెక్రెటరీ, వీఆర్‌ఓ, అసిస్టెంట్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు ఇంటర్ నుంచి విద్యార్హతలున్నాయి. ఇంటర్ పాసైనవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

    ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఫాలో అవాల్సిన స్టెప్స్ గురించి తెలుసుకోండి.

    Andhra Pradesh Sachivalayam Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి మీ ఆధార్ కార్డు నెంబర్, పేరు, తల్లిదండ్రుల వివరాలు, పుట్టిన తేదీ, పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్, విద్యార్హతల వివరాలు, అడ్రస్ ప్రూఫ్, కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే) లాంటివి తప్పనిసరిగా ఉఅందుబాటులో ఉండాలి. వీటిలో ఎస్ఎస్‌సీ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, వికలాంగులైతే మెడికల్ సర్టిఫికెట్, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఇతర డాక్యుమెంట్లు అందుబాటులో ఉండాలి.

    Andhra Pradesh Sachivalayam Recruitment 2020: అప్లై చేయండి ఇలా


    ముందుగా http://gramasachivalayam.ap.gov.in/ లేదా http://wardsachivalayam.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
    హోమ్ పేజీలో Notifications ట్యాబ్ పైన క్లిక్ చేయండి.
    గ్రామ సచివాలయాలకు సంబంధించిన 13 నోటిఫికేషన్లు, వార్డు సచివాలయ ఉద్యోగాలకు 6 నోటిఫికేషన్లు ఉంటాయి.
    వాటిలో మీరు కోరుకునే ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.
    ఆ తర్వాత హోమ్ పేజీలో Step 1 వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్-OTPR లింక్ ఉంటుంది క్లిక్ చేయండి.
    అందులో మీ పేరు ఇతర వివరాలతో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
    ఆ తర్వాత హోమ్ పేజీలో Step 2 క్లిక్ చేసి మీరు దరఖాస్తు చేయాలనుకునే లింక్ పైన క్లిక్ చేయండి.
    మీ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడీ, పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయండి.
    హోమ్ పేజీలో Step 3 పైన క్లిక్ చేసి పేమెంట్ ప్రక్రియ పూర్తి చేయాలి.
    మీ ఓటీపీఆర్‌తో పాటు దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    Vizag Steel Jobs: వైజాగ్ స్టీల్‌లో 188 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    Metro Rail Jobs: ఢిల్లీ మెట్రో రైల్‌లో 1493 జాబ్స్... దరఖాస్తు గడువు పొడిగింపు

    IOCL Jobs 2020: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో 248 ఉద్యోగాలు... తెలంగాణ, ఏపీలో ఖాళీలు
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు