Home /News /jobs /

ANDHRA PRADESH JOBS APPLICATIONS INVITING FOR VARIOUS JOB VACANCIES AT PRAKASHAM DISTRICT HERE FULL DETAILS NS

AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు ఎల్లుండి వరకే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇటీవల పలు ఖాళీల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లను (Job Notifications) విడుదల చేస్తోంది. జిల్లాల వారీగా ఆయా DMHOలు నోటిఫికేషన్లను (Notifications) విడుదల చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో (Prakasham District) పలు ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Notification) విడుదల చేశారు. మొత్తం 127 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్ మెన్ తదితర విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 5ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

  పోస్టుల వారీగా ఖాళీలు, వేతనాల వివరాలు ఇలా ఉన్నాయి.  పోస్టుఖాళీలువేతనం
  ల్యాబ్ టెక్నీషియన్(Lab Technician)21రూ. 28,000
  ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ (Female Nursing Orderly)68రూ. 12,000
  శానిటరీ అటెండర్ కం వాచ్ మెన్ (Sanitary Attender Cum Watchman)38రూ. 12,000

  విద్యార్హతల వివరాలు..
  ల్యాబ్ టెక్నీషియన్: డిప్లొమా/మెడికల్ ల్యాబరేటరీ టెక్నీషియన్ కోర్సులో డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులు. అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
  ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: టెన్త్ పాస్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
  శానిటరీ అటెండర్ కమ్ వాచ్ మెన్: టెన్త్ పాస్ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
  AP Jobs: ఏపీలో రేపు మరో భారీ జాబ్ మేళా.. ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రూ. 21 వేల వరకు వేతనం..

  ఎలా అప్లై చేయాలంటే..
  Step 1: అభ్యర్థులు మొదటగా ఈ లింక్ ద్వారా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
  Step 2: అనంతరం మీకు నోటిఫికేషన్ దగ్గర అప్లికేషన్ ఫామ్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.
  Step 3: అనంతరం అప్లికేషన్ ఫామ్ లో పేరు, తండ్రి పేరు, విద్యార్హతల వివరాలను నమోదు చేయాలి. ఇంకా పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అప్లికేషన్ ఫామ్ పై సూచించిన ప్రాంతంలో అంటించాలి.


  Step 4: ఇంకా అప్లికేషన్ ఫామ్ తో పాటు టెన్త్, ఇంటర్, విద్యార్హతల సర్టిఫికేట్లు, అనుభవానికి సంబంధించిన ధ్రువపత్రాలను జత చేయాలి.
  Step 5: అప్లికేషన్ ఫామ్ District Medical & Health Officer, Prakasam District, Ongole, GGH, Compound, Ongole చిరునామాకు ఈ నెల 05వ తేదీలోగా చేరేలా పంపించాలి.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Andhra Pradesh Government Jobs, Govt Jobs 2021, Job notification, Prakasham dist, State Government Jobs

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు