ANDHRA PRADESH JOBS APPLICATIONS INVITING FOR VARIOUS JOB VACANCIES AT KARNOOL DISTRICT HERE FULL DETAILS NS
Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని కర్నూల్ జిల్లాలో పలు ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్(Job Notifications) విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు(Jobs) అప్లై చేసేందుకు ఈ రోజును ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా (Corona) అనంతరం దేశ వ్యాప్తంగా వైద్య విభాగంలో ఖాళీలను (Jobs) ఆయా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలోని వైద్య విభాగంలో ఖాళీల భర్తీకి (Jobs) ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కర్నూలు జిల్లాలో పారామెడికల్ పర్సనల్ తో పాటు ఐటీ స్టాఫ్ (IT Staff) ఖాళీలను భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు(Jobs) దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. అప్లై చేసుకోవడానికి నవంబర్ 3, అంటే ఈ రోజును ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో(Notifications) స్పష్టం చేశారు.
ఖాళీల వివరాలు..
కర్నూలు జిల్లాలో పారామెడికల్ పర్సనల్ పోస్టులు 2, ఐటీ స్టాఫ్ విభాగంలో 1 ఖాళీ ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. 18 నుంచి 39 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల వేతనం ఉంటుంది. విద్యార్హతల వివరాలు: 1. పారా మెడికల్ పర్సనల్ :పారా మెడికల్ పర్సనల్ డిగ్రీ సబ్జెక్ట్ గా /బి.యస్సీ.నర్సింగ్ /జి.యస్ .యం. విద్యార్హత కలిగి ఉండాలి. ISRO Recruitment 2021: నిరుద్యోగులకు ఇస్రో శుభవార్త.. రూ. 1.12 లక్షల వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
ఎలా అప్లై చేయాలంటే..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను (Job Applications ) ఆఫ్ లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులు అధికారిక వెబ్ సైట్ http://kurnool.ap.gov.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులను పూర్తిగా నింపి విద్యార్హత, కులము, పుట్టిన తేదీ, నివాస ధ్రువీకరణ పత్రం జత చేసి అదనపు పథక సంచాలకులు, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, కర్నూలు చిరునామాలో నవంబర్ 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.