హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AIIMS Jobs 2022: మంగళగిరి ఎయిమ్స్ లో జాబ్స్.. ఇంటర్వ్యూల ద్వారానే అభ్యర్థుల ఎంపిక.. పూర్తి వివరాలివే

AIIMS Jobs 2022: మంగళగిరి ఎయిమ్స్ లో జాబ్స్.. ఇంటర్వ్యూల ద్వారానే అభ్యర్థుల ఎంపిక.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మంగళగిరి ఎయిమ్స్ లో పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా వైద్య రంగంలో ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు (Job Notifications) విడుదల అవుతున్నాయి. తాజాగా భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధర్వ్యంలో నిర్వహించబడుతున్న మంగళగిరిలోని ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్ట్యిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్-AIIMS) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 06 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. సీనియర్ రెసిడెంట్లు/సీనియర్ డెమాన్స్ట్రేటర్ల విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. బయో కెమిస్ట్రీ, బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, హాస్పటల్ అడ్మినిస్ట్రేషన్, పీడియాట్రిక్స్, పల్మనరీ మెడిసిన్, రెడియో డయాగ్నసిస్ స్పెషలైజేషన్లలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సంబంధిత స్పెసలైజేషన్లలో ఎండీ/డీఎన్బీ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయస్సు 45 ఏళ్లలోపు ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన మెడికల్ అభ్యర్థులకు రూ.67 వేలు, నాన్ మెడికల్ వారికి నెలకు రూ.56 వేల వేతనం ఉంటుంది.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ప్రకటించారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూలను నిర్వహించు చిరునామా: గ్రౌండ్ ఫ్లోర్, అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, ఎయిమ్స్ మంగళగిరి, గుంటూరు.

AP Job Mela: ఏపీలో రేపు మరో జాబ్ మేళా.. ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ అర్హతతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకోవడం ఇలా..

-అభ్యర్థులు మొదటగా ఎయిమ్స్ అధికారిక వెబ్ సైట్  https://www.aiimsmangalagiri.edu.in/ ను ఓపెన్ చేయాలి.

-అనంతరం Recruitments ఆప్షన్ పై క్లిక చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

- అనంతరం నోటిఫికేషన్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది.

- అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని, పూర్తిగా వివరాలను నింపాలి.

First published:

Tags: Aiims, Central Government Jobs, Job notification, JOBS

ఉత్తమ కథలు