Home /News /jobs /

ANDHRA PRADESH JOBS APPLICATIONS INVITING FOR JOB VACANCIES IN RELIANCE JIO NS

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్, ఇంటర్ అర్హతతో Reliance Jioలో ఉద్యోగాలు.. ఇంటి నుంచే పని చేసే ఛాన్స్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh Jobs: ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఏపీలోని నిరుద్యోగులకు వరంలా మారింది. సంస్థ నుంచి వరుసగా వివిధ ప్రముఖ సంస్థల్లో వందల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల అవుతున్నాయి. కొన్ని సార్లు నిరుద్యోగులకు శిక్షణ సైతం అందించి వివిధ సంస్థల్లో ఉపాధి కల్పిస్తున్నారు అధికారులు. తాజాగా ప్రముఖ రిలయన్స్ జియో (Railance Jio) సంస్థలో ఉద్యోగాల భర్తీకి APSSDC నుంచి ప్రకటన విడుదలైంది. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఈ ఖాళీల భర్తీ చేపట్టారు అధికారులు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 200 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 12, 500 వరకు వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
    Andhra Pradesh Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. భారీగా వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..
    Andhra Pradesh Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ HYUNDAI MOBIS సంస్థలో ఉద్యోగాలు.. వివరాలివే

    విద్యార్హతల వివరాలు..
    ఇంటర్ లేదా ఏదైనా విభాగంలో డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు. అభ్యర్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలు వచ్చి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వయస్సు 19 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అభ్యర్థులు అండ్రాయిడ్ మొబైల్(వర్షన్ 6.0+), పూర్తి డేట్ ఆఫ్ బర్త్ తో కూడిన ఆధార్ కార్డు, పాన్ కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలి.
    Registration - Direct Link


    ఇతర వివరాలు..
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 24లోగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేయాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో ఈ అవకాశం కల్పించారు. ఇతర పూర్తి వివరాలకు 8179541641 నంబరును సంప్రదించవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Govt Jobs 2021, Jio 5G, Reliance Jio

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు