Home /News /jobs /

ANDHRA PRADESH JOBS APPLICATIONS INVITING FOR JOB VACANCIES AT D MART KHAZANA JEWELLERY HERE FULL DETAILS NS

AP Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో D-Mart, Khazana Jewelleryలో ఉద్యోగాలు.. రూ. 18 వేల వరకు వేతనం.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో జాబ్ మేళాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. D-Mart, Khazana Jewelleryలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించిన ప్రకటన విడుదలైంది. ఈ నెల 30న నెల్లూరులో జాబ్ మేళా(Job Mela) నిర్వహించనున్నట్లు APSSDC ప్రకటన విడుదల చేసింది. ఈ జాబ్ మేళా ద్వారా డీ-మార్ట్ D-Mart, ఖజానా జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ (Khazana Jewellery Pvt. Ltd)లో పలు ఖాళీలను(Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా సంస్థల్లో మొత్తం 100 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను (Interviews) నిర్వహించునున్నారు. టెన్త్, ఇంటర్ మరియు డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు (Jobs) అప్లై చేసేందుకు అర్హులు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    D-Mart: ఈ సంస్థలో మొత్తం 90 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. ఇందులో క్యాషియర్, గోడౌన్ అసిస్టెంట్స్, పార్ట్ టైమ్ జాబ్-క్యాషియర్స్, సేల్స్ అసోసియేట్స్, ప్యాకర్స్, పార్ట్ టైమ్ జాబ్-సేట్స్ అసోసియేట్/ప్యాకర్స్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు. ఎంపికైన వారికి పోస్టు ఆధారంగా నెలకు రూ. 5 వేల నుంచి రూ. 10,626 వరకు చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారి వయస్సు 18-25 ఏళ్ల వయస్సు ఉండాలి.
    NHPC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. NHPCలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

    Khazana Jewellery Pvt.Ltd: ఈ సంస్థలో 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో సేల్స్ ఎగ్జిక్యూటివ్/క్యాషియర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటర్ నుంచి డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేల వేతనం చెల్లించనున్నట్లు తెలిపారు. అయితే కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారి వయస్సు 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
    NTPC Recruitment 2021: ఇంజనీరింగ్ అభ్యర్థులకు NTPCలో రూ. 60 వేల వేతనంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్

    రిజిస్ట్రేషన్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న వారు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
    ఇతర వివరాలు:
    -అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హత సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, ఆధార్ వెంట తీసుకురావాలని నోటిఫికేషన్లో తెలిపారు.
    -ఎంపికైన అభ్యర్థులు నెల్లూరులో పని చేయాల్సి ఉంటుందని తెలిపారు.
    -ఇతర పూర్తి వివరాలకు 7780289591, 8639867407 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.



    ఇంటర్వ్యూ నిర్వహించే వేధిక: V.R College, Opp Clock Tower, Near VRC Centre, Nellore చిరునామాలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 30న ఉదయం 10 గంటలకు ఈ ఇంటర్వ్యూకు హాజరు కావాలని నోటిఫికేషన్లో తెలిపారు,
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Career and Courses, Job Mela, JOBS, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు