Home /News /jobs /

ANDHRA PRADESH JOBS APPLICATIONS INVITED FOR JOB VACANCIES IN HYUNDAI MOBIS HERE FULL DETAILS NS

Andhra Pradesh Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రముఖ HYUNDAI MOBIS సంస్థలో ఉద్యోగాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ కార్పేరేషన్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23లోగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో సూచించారు.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ప్రముఖ HYUNDAI MOBIS సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రొడక్షన్ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 23 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    AIIMS Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
    Andhra Pradesh Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. భారీగా వాలంటీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..

    విద్యార్హతల వివరాలు..
    ప్రొడక్షన్ ఆపరేటర్ విభాగంలో 100 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లో నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. అభ్యర్థులు 2018-2021 వరకు పాసై ఉండాలి. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం కలిగిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. వయస్సు 25 ఏళ్ల లోపే ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
    Registrations - Direct Link



    ఇతర వివరాలు..
    ఎంపికైన అభ్యర్థులు అనంతపురం జిల్లాలోని పెనుగొండలో పని చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 8688842879 నంబరును సంప్రదించాలని నోటిఫికేషన్లో సూచించారు. రిజిస్ట్రేషన్ కు ఈ నెల 23ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Govt Jobs 2021, JOBS, Jobs in telangana, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు