• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • ANDHRA PRADESH JOBS APPLICATIONS INVITED FOR JOB VACANCIES AT PATRA INDIA LAST DATE FOR TO APPLY IS MAY 15 NS

Andhra Pradesh Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిప్లొమో, డిగ్రీ, పీజీ అర్హతతో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ కు మరో రెండు రోజులే ఛాన్స్

Andhra Pradesh Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిప్లొమో, డిగ్రీ, పీజీ అర్హతతో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ కు మరో రెండు రోజులే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

APSSDC Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. డిగ్రీ, పీజీ, డిప్లొమో విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 15లోగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) నుంచి తాజాగా మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. PATRA India సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఏపీఎస్ఎస్డీసీ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 300 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 15లోగా రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. వర్చవల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఏడాదికి రూ.1,45,500 వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు.
    BEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. బీఈఎల్ లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే..
    IIT Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. ఐఐటీలో డిగ్రీ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

    ఖాళీలు, అర్హతల వివరాలు..
    ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రిమోట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. మూడేళ్ల డిప్లొమో కోర్సు చేసిన వారితో పాటు డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు మంచి కమ్యూనికేషన్ తో పాటు ఎక్సెల్ పై అవగాహన ఉండాలి. టైపింగ్ స్పీడ్ ఉండాలి. వయస్సు 18-40 ఏళ్లు ఉండాలి. పురుషులు, స్త్రీలు ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
    Registration - Direct Link



    ఇంటర్వ్యూ వివరాలు..
    జూమ్ యాప్ ద్వారా వర్చువల్ విధానంలో ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మొదట హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది. అనంతరం టెక్నికల్ రౌండ్ ఉంటుంది. ఈ రౌండ్ లో అభ్యర్థుల టైపింగ్ స్పీడ్, ఎక్సెల్(Excel)పై నాలెడ్జ్ ను పరీక్షిస్తారు. అనంతరం సీనియర్ మేనేజర్ రౌండ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అభ్యర్థులకు పర్సనల్ ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్ తప్పనిసరిగా ఉండాలి. హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు ఇతర వివరాలకు 1800-425-2422 నంబరును సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
    జాబ్ లొకేషన్: విశాఖపట్నం/వర్క్ ఫ్రం హోమ్.
    Published by:Nikhil Kumar S
    First published: