• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • ANDHRA PRADESH JOBS APPLICATIONS INVITED FOR IMERIT TECHNOLOGIES SERVICES PVT LTD LAST DATE FOR REGISTRATION IS MAY 10 NS

Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ కు ఎల్లుండి వరకే ఛాన్స్

Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రిజిస్ట్రేషన్ కు ఎల్లుండి వరకే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 10లోగా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. iMerit Technologies services pvt ltd లో ఖాళీల భర్తీకి ఏపీఎస్ఎస్డీసీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 60 ఖాళీల భర్తీని ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అప్రంటీస్ మరియు ITES ఎగ్జిక్యూటీవ్ విభాగంలో ఈ ఖాళీలు భర్తీ చేస్తున్నారు.  ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నంలోని రిషికొండలో పని చేయాల్సి ఉంటుంది. అప్రంటీస్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.9500 వరకు వేతనం చెల్లించనున్నారు. IETS ఎగ్జిక్యూటీవ్ గా ఎంపికైన వారికి రూ.11 వేల వరకు చెల్లించనున్నారు.
    SBI Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. SBIలో 5 వేలకు పైగా ఉద్యోగాలు.. అప్లికేషన్లకు మరి కొన్ని రోజులే గడువు
    నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

    విద్యార్హతల వివరాలు..
    మొత్తం 60 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇంటర్, ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. బీటెక్ చేసిన వారు అప్లై చేసేందుకు అనర్హులని ప్రకటనలో స్పష్టం చేశారు. ఫ్రెషర్స్ తో పాటు అనుభవం కలిగిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులకు మంచి ఇంగ్లిష్ కమ్యూనికేషన్ తో పాటు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
    Registration - Direct Link



    అభ్యర్థులు మొదటగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ నెల 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ రెండు రౌండ్లుగా ఉంటుంది. మొదటి రౌండ్ లో రాత పరీక్ష ఉంటుంది. రెండవ రౌండ్ లో ఫేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ రెండు రౌండ్లలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 18004252422 నంబరును సంప్రదించాలని ప్రకటనలో సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు