ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. విశాఖపట్నం ఈఎన్టీ ఆస్పత్రిలో ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. మొత్తం 12 ఖాళీలున్నాయి. ఆడియో టెక్నీషియన్, స్పీచ్ థెరపిస్ట్, రేడియోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి పోస్టులున్నాయి. ఇవి కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పోస్టులు మాత్రమే. కాంట్రాక్ట్ గడువు ఒక ఏడాది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (Application Process) కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 15 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే అభ్యర్థులు పోస్టులో దరఖాస్తు ఫామ్స్ పంపాల్సి ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
ENT Hospital Visakhapatnam Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు
12
విద్యార్హతలు
ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2
2
డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బీ ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ
ఆడియో టెక్నీషియన్
2
బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్పీచ్ థెరపీ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీ
ENT Hospital Visakhapatnam Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. వయస్సు- 2021 డిసెంబర్ 1 నాటికి 18 నుంచి 42 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం- మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం- అభ్యర్థులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ https://visakhapatnam.ap.gov.in/ లో డౌన్లోడ్ చేయాలి. దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత Hospital Development Society, Govt. ENT Hospital, Visakhapatnam పేరుతో రూ.200 డీడీ తీసుకోవాలి. అప్లికేషన్ ఫామ్‌కు టెన్త్, ఇంటర్, గ్రాడ్యుయేషన్, క్వాలిఫికేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ జత చేయాలి. అప్లికేషన్ ఫామ్స్‌ను 2021 డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటల్లోగా నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.