హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Andhra Pradesh Jobs : 224 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ ఉద్యోగాలు.. జీతం రూ.53,500.. ద‌ర‌ఖాస్తుకు ఒక్క‌రోజే అవ‌కాశం

Andhra Pradesh Jobs : 224 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ ఉద్యోగాలు.. జీతం రూ.53,500.. ద‌ర‌ఖాస్తుకు ఒక్క‌రోజే అవ‌కాశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ ఉద్యోగాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజ‌య‌వాడ‌లో ఉన్న డైరెర్ట‌ర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (Directorate of Public Health & Family Welfare) విభాగంలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా 224 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌రఖాస్తుకు అక్టోబ‌ర్ 19, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇంకా చదవండి ...

  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజ‌య‌వాడ‌లో ఉన్న డైరెర్ట‌ర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (Directorate of Public Health & Family Welfare) విభాగంలో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ (Notification) ద్వారా 224 సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్ల పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆఫ్‌లైన్ ద్వారా ఉంటుంది. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు రూ.53,500 జీతం అందిస్తారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి అక్టోబ‌ర్ 19, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ద‌ర‌ఖాస్తుకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజ‌ర్వేష‌న్ ఆధారంగా ప‌రీక్ష ఫీజులో మిన‌హాయింపు ఉంటుంది. ద‌ర‌ఖాస్తు విధానం నోటిఫికేష‌న్ స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://hmfw.ap.gov.in/ ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

  ముఖ్య‌మైన స‌మాచారం..

  పోస్టు పేరుసివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్‌
  మొత్తం ఖాళీలు224
  ద‌ర‌ఖాస్తు ప్రారంభంఅక్టోబ‌ర్ 4, 2021
  ద‌ర‌ఖాస్తు రుసుంరూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు
  ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీఅక్టోబ‌ర్ 18, 2021
  అప్లికేష‌న్ పంపాల్సి అడ్ర‌స్The Director of Public Health & Family Welfare,Himagna Towers, 3rd Floor,Saipuram Colony,One Centre, Gollapudi, Vijayawada.Andhra Pradesh,PIN: 521 225.
  ద‌ర‌ఖాస్తులు చేరాల్సిన చివ‌రి తేదీఅక్టోబ‌ర్ 19, 2021


  NEET 2021 : త్వ‌ర‌లో నీట్ 2021 ఫ‌లితాలు.. దేశంలో టాప్ మెడిక‌ల్ కాలేజీల లిస్ట్‌


  అర్హ‌త‌లు.. ఎంపిక విధానం..

  - ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉండాలి. 42 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. ఇంట‌ర్న్‌షిప్‌తోపాటు, ఏపీ మెడిక‌ల్ కౌన్సిల్‌లో రిజిస్ట్ర‌ర్ అయి ఉండాలి.

  - ద‌ర‌ఖాస్తు చేసుకొన్న వారికి ఎటువంటి రాత ప‌రీక్ష ఉండ‌దు.

  - అర్హులైన అభ్య‌ర్థుల ద‌ర‌ఖాస్తును ప‌రిశీలిస్తారు.

  - అకాడ‌మిక్ మెరిట్‌, స‌ర్వీస్ వెయిటేజీ, ఇంట‌ర్న్‌షిప్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

  మార్కుల‌ విధానం..

  - అర్హ‌త ప‌రీక్ష మెరిట్ ద్వారా 75 మార్కులు

  - అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం నుంచి కాలాన్ని లెక్కించి 10 మార్కులు వెయిటేజ్ ఉంటుంది.

  - 15 మార్కులు అభ్య‌ర్థి ప‌ని అనుభ‌వం (Experience) ఆధారంగా ఇస్తారు.

  SBI PO Recruitment 2021 : నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఎస్‌బీఐలో 2056 పీఓ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌


  ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

  Step 1: అభ్య‌ర్థి కేవ‌లం ఆఫ్‌లైన్ ద్వారానే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

  Step 2: ముందుగా అధికారిక జిల్లా వెబ్‌సైట్ https://hmfw.ap.gov.in/ ను సంద‌ర్శించాలి.

  Step 3: ద‌ర‌ఖాస్తు ఫాం కోసం అనంత‌రం నోటిఫికేష‌న్ డౌలోడ్ చేసుకోవాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

  Step 4: ఆన్‌లైన్‌లో అప్లికేష‌న్ ఫాం నింపాలి అందుకోసం https://hmfw.ap.gov.in/DH_CAS_Recruitment_ApplicationForm.aspx ఈ లింక్‌లోకి వెళ్లాలి.

  Step 5: త‌ప్పులు లేకుండా అప్లికేష‌న్ ఫాం నింపాలి.

  Step 6: నింపిన ద‌ర‌ఖాస్తు ఫాంను ప్రింట్ తీసి అవ‌స‌ర‌మైన ధ్రువ‌ప‌త్రాల‌ను పొందుప‌రిచి సంబంధిత అడ్ర‌స్‌కు పంపాలి.

  Step 7: ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 19, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Govt Jobs 2021, Job notification, JOBS

  ఉత్తమ కథలు