• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • ANDHRA PRADESH JOB NOTIFICATION RELEASED FOR VACANCIES AT KAPSTON FACILITIES MANAGEMENT LIMITED HERE FULL DETAILS NS

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. Kapston Facilities Management Limited సంస్థ లో 100 ఖాళీల భర్తీకి ఏపీఎస్ఎస్డీసీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులు Kapston సంస్థ తరఫున Toshiba Transmission and Distribution Systemsలో పనిచేయాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.
    AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

    ఖాళీలు, అర్హతల వివరాలు..
    మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ట్రైనీ మరియు మిషన్ ఆపరేటర్స్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. ఐటీఐ (ఎలక్ట్రికల్ & ఫిట్టర్) అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు అర్హులు. 2019, 20, 21లో పాసైన అభ్యర్థఉలు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ. 13 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. అయితే.. కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    Registration - Direct Link



    ఇతర వివరాలు..
    ఈ ఉద్యోగాలకు రిజిస్టర్ చేసుకోవడానికి ఈ నెల 12ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆలోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ సమీపంలోని పటాన్ చెరు, రుద్రారంలో పని చేయాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 7013504977, 8501918668 నంబర్లను సంప్రదించవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు