AP Job Mela: ఏపీలో ఎల్లుండి భారీ జాబ్ మేళా.. Hero, Muthoot తదితర ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు.. వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ జాబ్ మేళా నిర్వహించేందుకు APSSDC సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ - APSSDC రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరంలా మారింది. వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఇటీవల APSSDC నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల అవుతున్నాయి. పలు ప్రాంతాల్లో APSSDC ఆధ్వర్యంలో జాబ్ మేళాలను సైతం నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ నెల 13న మరో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు APSSDC తెలిపింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు.
    BEL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. భారత్ ఎలక్ట్రానిక్స్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరో ఐదు రోజులే ఛాన్స్
    Telangana Jobs: తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ జాబ్ నోటిఫికేషన్... నేటి నుంచి దరఖాస్తులు

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    ఈ జాబ్ మేళా ద్వారా మూడు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
    Muthoot Finance Pvt Ltd: ఈ సంస్థలో 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. జూనియర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటీవ్, ప్రొబేషన్ ఆఫీసర్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. బీకాం/బీబీఎం/బీఎస్సీ/ఎంబీఏ/ఎంకామ్ మరియు ఏదైనా డిగ్రి చేసిన వారు ఈ ఉద్యోగాలకు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. వయస్సు 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు 14 వేల నుంచి రూ. 16 వేల వరకు చెల్లించనున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.
    Hero Motors: Assembling విభాగంలో ఈ సంస్థలో 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ వెల్డర్, ఫిట్టర్, డీజిల్, మెకానిక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 14,500 వరకు వేతనం చెల్లించనున్నారు. వయస్సు 19-27 ఏళ్లు ఉండాలి. అయితే ఈ ఉద్యోగాలకు కేవలం స్త్రీలు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    RSMIPL: ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేయొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10,500 వేతనంతో పాటు వసతి కల్పిస్తారు. అభ్యర్థుల వయస్సు 19-27 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం స్త్రీలు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.



    ఇతర వివరాలు..
    అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు Nalanda Degree College, Ramnagar - Anantapur చిరునామాలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు అనంతపూర్ & శ్రీసిటీలో పని చేయాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలకు 9010039001, 9550855080 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published: