Home /News /jobs /

ANDHRA PRADESH JOB MELA ON JULY 4 AT VIZAG DISTRICT FOR VARIOUS JOB VACANCIES HERE REGISTRATION LINK NS

Mega Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. రేపు మెగా జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలోని నిరుద్యోగులకు స్కిల్ డవప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 4న మరో భారీ జాబ్ మేళా(Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో జాబ్ మేళా (Job Mela) ను ప్రకటించింది సంస్థ. Beedata Technologies, TriGeo Technologies, ALIVIRA, Lakshmi Hyudai, Appollo Pharmacy సంస్థలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలను విశాఖ జిల్లాలోని పెందుర్తిలో నిర్వహించనున్నారు.

    సంస్థల వారీగా ఖాళీలు, విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి..
    Beedata Technologies: ఈ సంస్థలో 100కు పైగా ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, బీటెక్, బెఎస్సీ/బీకామ్/ఎంఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నం(మదురవాడ) లేదా హైదరాబాద్ (యూసఫ్ గూడ) లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    TriGeo Technologies Pvt. Ltd: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. బీటెక్/డిప్లొమా/డిగ్రీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.16,827 వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంటి. వయస్సు 19 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
    ALIVIRA: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 18 ఏళ్లకు పైగా ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

    Lakshmi Hyudai: ఈ సంస్థలో 20 ఖాళీలు ఉన్నాయి, ఏదైనా డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.17 వేల వరకు వేతనం ఉంటుంది. అనకాపల్లి/గాజువాక/మురళినగర్ లో పని చేయాల్సి ఉంటుంది. వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. అయితే కేవలం పరుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
    Apollo Pharmacies Limited: ఈ సంస్థలో 200కు పైగా ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డీ/బీ/ఎం ఫార్మసీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.17 వేల వరకు వేతనం ఉంటుంది.
    IBPS Clerk Recruitment 2022: తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ బ్యాంకుల్లో 308 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే



    ఇతర వివరాలు:
    - అభ్యర్థులు www.apssdc.in లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
    - అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో ఫార్మల్ డ్రస్ తో హాజరు కావాల్సి ఉంటుంది. ఇంకా Resume, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్, పాన్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    - అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9014772885, 9059592782 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
    -ఈ నెల 4న ఆదర్శ్ డిగ్రీ కాలేజీ, ఎస్బీఐ పక్కన, బాలాజీ నగర్, పెందుర్తి, విశాఖ జిల్లా చిరునామాలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Job Mela, JOBS, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు