ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ఇటీవల వరుసగా జాబ్ మేళాలకు సంబంధించి ప్రకటన విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో జాబ్ మేళా(Job Mela)కు సంబంధించి APSSDC కీలక ప్రకటన చేసింది. విప్రో(Wipro) ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ (CRP-Plant), హిందూపూర్ లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు APSSDC వెల్లడించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 17న ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఇతర వివరాలు:
ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఐటీఐ(ఫిట్టర్), డిప్లొమా(మెకానికల్), ఐటీఐ(టర్నర్) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 2019, 2020, 2021లో పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.13 వేల చొప్పున స్టైపండ్ చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు తూమకుంట, హిందూపూర్ లో పని చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందిన నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వయస్సు 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి. ఫ్రెషర్స్/అనుభవం ఉన్న వాళ్లు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
Jobs in Telangana: డిగ్రీ అర్హతతలో ఈఎస్ఐసీలో 72 ఉద్యోగాలు.. ప్రారంభమైన అప్లికేషన్ ప్రాసెస్!
ఇంటర్వ్యూ వివరాలు: ఫేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
వర్క్ లొకేషన్: తూమకుంట, హిందూపూర్,
-ఎంపికైన అభ్యర్థులకు హిందూపూర్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
-క్యాంటీన్ సదుపాయం ఉంటుంది.
@AP_Skill is Collaborated with @wiproinfra to Conduct Industry Customized Skill Training & Placement Program at (CRP Plant) #AnantapurDistrict
Registration Link: https://t.co/Xnrotggdpb
Contact: Mr. Nagappa - 8688030375
Mr. Lokesh - 7013425587
APSSDC Helpline : 9988853335 pic.twitter.com/R6WKrLmQgF
— AP Skill Development (@AP_Skill) January 13, 2022
ఇతర వివరాలు:
అభ్యర్థులు ముందుగా apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 17 ఉదయం 9 గంటలకు విప్రో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్, తూమకుంట, హిందూపూర్, ఏపీలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు ఉదయం 9 గంటలకు హాజరు కావాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 8688030375, 7013425587 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hindupuram, Job Mela, Wipro