Home /News /jobs /

ANDHRA PRADESH JOB MELA ON AUGUST 3 APPLICATIONS INVITING FOR JOB VACANCIES AT FLIPKART HERE REGISTRATION PROCESS NS

Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో రూ.40 వేల వేతనంతో జాబ్స్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో సారి ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో సారి ఉద్యోగాల (Jobs) భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ప్రముఖ ఫ్లిప్ కార్ట్ సంస్థలో ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ప్రకటన ద్వారా మొత్తం 71 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ (Flipkart Job Registration) చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 3న ఉదయం 10 గంటలకు వైజాగ్ లో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 71 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. డెలివరీ అసోసియేట్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిప్లొమా, ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-45 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.
    CREDR Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో CREDR సంస్థలో జాబ్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి



    ఇతర వివరాలు:
    - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 3న హెచ్ఆర్, ఫైనల్ రౌండ్ నిర్వహించిన ఎంపిక చేస్తారు.
    - ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నం లో పని చేయాల్సి ఉంటుంది.
    - ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, ఆధార్, విద్యార్హతల సర్టిఫికేట్లు, బ్యాంక్ పాస్ బుక్ ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    - అభ్యర్థులు ఇంగ్లిష్ లో ప్రింట్ చేయబడిన అడ్రస్ ను చదవగలగాలి.
    - ఇతర పూర్తి వివరాలకు 9014772885 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
    -ఎంపికైన అభ్యర్థులకు స్పాట్ లో ఆఫర్ లెటర్ ఇవ్వనున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Flipkart, Job Mela, JOBS, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు