AP Job Mela: ఏపీలో రేపు భారీ జాబ్ మేళా.. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకావశాలు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ - APSSDC ఆధ్వర్యంలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీకి జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్, PSR Constructions Pvt Ltd, Innovsource(SBI Cards) తదితర సంస్థల్లో ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    AP High Court Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    1. Shriram Life Insurance: ఈ సంస్థలో మార్కెటింగ్ మేనేజర్ విభాగంలో 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ.13,500 వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్, అలవెన్స్ అందించనున్నారు. అభ్యర్థుల వయస్సు 19 నుంచి 32 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అయితే.. కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో తెలిపారు.
    2.PSR Constructions Pvt Ltd: ఈ సంస్థలో 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిప్లొమా/B.Tech - Civil&Mechanical అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఈ ఖాళీల భర్తీకి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చు. వయస్సు 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ. 9 వేల నుంచి రూ. 10 వేల వరకు అందించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

    3.Innovsource(SBI CARDS): బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటీవ్ విభాగంలో 20 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్, ఆపై తరగతులు చదివిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వేతనం చెల్లించనున్నారు. PF+ESI సదుపాయం కల్పించనున్నారు.



    ఇతర వివరాలు:
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఈ నెల 23న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలను ‘డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీస్, ఒంగోలు-ప్రకాశం జిల్లా’ చిరునామాలో నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఒంగోలులో పని చేయాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 9652518187 నంబరును సంప్రదించాలని నోటిఫికేషన్లో సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published: