హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Job Mela: ఏపీలో రేపు మరో జాబ్ మేళా.. ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ అర్హతతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

AP Job Mela: ఏపీలో రేపు మరో జాబ్ మేళా.. ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ అర్హతతో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా మరో జాబ్ మేళా (Job Mela)కు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC). ప్రముఖ వరుణ్ మోటార్స్, కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ సంస్థల్లో ఖాళీల భర్తీకి ఈ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరంలా మారింది. వరుసగా జాబ్ మేళాలకు (Job Mela) సంబంధించిన ప్రకటనలు విడుదల చేస్తోంది. తాజాగా మరో జాబ్ మేళాకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్. ప్రముఖ వరుణ్ మోటార్స్, కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ సంస్థల్లో ఖాళీల భర్తీకి ఈ ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 11న అంటే రేపు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

  ఖాళీలు, విద్యార్హతలు..

  వరుణ్ మోటార్స్: ఈ సంస్థలో వివిధ విభాగాల్లో 65 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ, బీటెక్, డిప్లొమా, డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి వారి పోస్టుల ఆధారంగా నెలకు రూ.9 వేల నుంచి రూ.11 వేల వరకు వేతనం ఉంటుంది. ఇంకా ఇన్సెంటీవ్స్ సైతం ఉంటాయి. ఎంపికైన వారు కృష్ణా జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 25 ఏళ్లలోపు ఉండాలి.

  కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ (Continental Coffee Ltd): ఈ సంస్థలో 60 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల నుంచి రూ.16 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 18-30 ఏళ్లు ఉండాలి.

  ఇతర వివరాలు:

  - అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

  - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 11న ఉదయం 10 గంటలకు గవర్నమెంట్ పాలిటెక్నిక్కాలేజ్, వరలక్ష్మి పాలిటెక్నిక్ బిల్డింగ్, మచిలీపట్నం-కృష్ణా జిల్లా చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

  - అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ ఫొటో&ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

  - అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9440444033, 9966489796 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Job Mela, JOBS, Private Jobs

  ఉత్తమ కథలు