హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Mela: ఏపీలో మంచి వేతనంతో 450 ప్రైవేట్ జాబ్స్.. ఈ నెల 22న ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే

Job Mela: ఏపీలో మంచి వేతనంతో 450 ప్రైవేట్ జాబ్స్.. ఈ నెల 22న ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు  శుభవార్త చెప్పింది. ఈ నెల 22న మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు  శుభవార్త చెప్పింది. ఈ నెల 22న మరో జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ అమర్ రాజా బ్యాటరీస్ తో పాటు, కియా మోటార్స్ (KIA Motors), కాంన్సెంట్రిక్ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న వారికి ఈ నెల 22న ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

సంస్థల వారీగా ఖాళీలు..

Concentrix: ఈ సంస్థలో 150 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ లేదా/బీటెక్ చేసిన వారు ఈ ఖాళీలకు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.18 వేల నుంచి రూ.24 వేల వరకు వేతనం ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారు చెన్నై/హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.

KIA Motors: ఈ సంస్థలో నీమ్ ట్రైనీ విభాగంలో 100 ఖాళీలు ఉన్నాయి. డిప్లొమా విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనంతో పాటు రూ.2 వేల ట్రాన్స్పోర్టేషన్ సదుపాయం ఉంటుంది.

అమర్ రాజా బ్యాటరీస్: ఈ సంస్థలో 200 ఖాళీలు ఉన్నాయి. మిషన్ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, ఐటీఐ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.13,500 వేతనం ఉంటుంది. దరఖాస్తుదారుల వయస్సు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి.

Government Jobs 2022: డిగ్రీ పూర్తి చేశారా..? ఈ 4 ఉద్యోగ నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోండిలా..

ఇతర వివరాలు:

- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 22న S.G గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, పీలేరు, అన్నమాచార్య జిల్లా చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకవాల్సి ఉంటుంది.

- అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

- అభ్యర్థులు 7093618420, 9550095775 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

First published:

Tags: Job Mela, JOBS, Private Jobs

ఉత్తమ కథలు