Home /News /jobs /

ANDHRA PRADESH JOB MELA AT KARNOOL FOR VARIOUS JOBS VACANCIES AT ASTRAIN AVIATION SALARY UP TO 10 LAKHS NS

AP Job Mela: ఏపీలో రేపు భారీ జాబ్ మేళా.. టెన్త్ నుంచి పీజీ అర్హతతో ఉద్యోగాలు.. ఏడాదికి రూ. 10 లక్షల వరకు వేతనం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Astrain Aviation సంస్థలో ఖాళీల భర్తీకి APSSDC రేపు కర్నూలులో ఇంటర్వ్యూలను (Job Interviews) నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) మరో సారి భారీ జాబ్ మేళాను (Job Mela) ప్రకటించింది. ఈ నెల 2న కర్నూలు జిల్లా నంద్యాలలో జాబ్ మేళా (Job Mela) ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. Astrain Aviation సంస్థలో ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 2.4 లక్షల నుంచి రూ. 10.5 లక్షల వేతనం (Salary) చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు చెన్నైలో (Chennai) పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో (Job Notification) పేర్కొన్నారు. అభ్యర్థులు ఇతర వివరాలకు 9014588552, 9059524482 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

    విద్యార్హతల వివరాలు:
    మొత్తం 300 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటీవ్, ఎయిర్ హెస్టస్ తో సహం మొత్తం 13 విభాగాల్లో కాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీటెక్, డిగ్రీ, పీజీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో తెలిపారు. అభ్యర్థులు 2017-2021 మధ్యలో పాసై ఉండాలి. పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 19-35 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు పాజిటివ్ ఆలోచన విధానం కలిగి ఉండాలని నోటిఫికేషన్లో తెలిపారు.
    BHEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. BHELలో రూ. 70 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

    వేతన వివరాలు: వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు వేతనాలను నిర్ణయించారు. అత్యల్పంగా కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటీవ్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటీవ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఏడాదికి రూ. 2.4 లక్షల ప్యాకేజీ ఉంటుంది. అంటే నెలకు రూ. 18 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. అత్యధికంగా క్యాబిన్ క్రూ(Cabin Crew), ఎయిర్ హోస్టెస్ (Air Hostess) ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 60 వేల నుంచి రూ.90 వేల వరకు చెల్లించనున్నారు.
    IOCL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. ఇండియన్ ఆయిల్ లో 527 జాబ్స్.. దరఖాస్తుకు మరో మూడు రోజులే ఛాన్స్

    ఎంపిక విధానం: ఆప్టిట్యూడ్ టెస్ట్/టెక్నికల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, ఫేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

    కావాల్సిన డాక్యుమెంట్లు: అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్&ఆధార్ వెంట తీసుకురావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.


    రిజిస్ట్రేషన్: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    ఇంటర్వ్యూ వేధిక: ఇంటర్వ్యూలను Sri Ramakrishna Degree College, Srinivasa Centre, Nandyala-Karnool District చిరునామాలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Job Mela, Private Jobs, State Government Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు