Home /News /jobs /

AP Jobs: ఏపీలో రేపు మరో భారీ జాబ్ మేళా.. ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రూ. 21 వేల వరకు వేతనం..

AP Jobs: ఏపీలో రేపు మరో భారీ జాబ్ మేళా.. ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. రూ. 21 వేల వరకు వేతనం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా(Job Mela) కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరంలాగా మారింది. వరుసగా జాబ్ మేళా(Job Mela)లు నిర్వహిస్తూ స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. తాజాగా APSSDC మరో జాబ్ మేళాను ప్రకటించింది. ఈ నెల 04న ఒంగోలులో జాబ్ మేళా(Job Mela)ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. meesho, Jaya Laxmi Automobiles, Madhavi Rajesh & Associates (CA) తదితర సంస్థల్లో ఈ జాబ్ మేళా ద్వారా ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు APSSDC తెలిపింది. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 136 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇంటర్, బీకాం, ఎంబీఏ విద్యార్హతలు కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో (Job Notifications) స్పష్టం చేశారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
    Meesho: ఈ సంస్థలో మొత్తం 125 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బిజినెస్ డవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇంటర్, ఆపై విద్యార్హతలు కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 21 వేల వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు విజయవాడలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 19-28 ఏళ్లు ఉండాలని, పురుషులు/స్త్రీలు ఎవరైనా ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో వెల్లడించారు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.21 వేల వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో స్పష్టం చేశారు.
    BOB Recruitment 2021: బీటెక్ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్... రూ.89,000 వరకు వేతనం

    Jaya Lakshmi Automobiles: ఈ సంస్థలో 10 ఖాళీలు ఉన్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, ఆపై విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు తప్పనిసరిగా బైక్+డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి కంపెనీ నిబంధనల ప్రకారం వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

    Madhavi Rajesh & Associates: ఈ సంస్థలో 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీకామ్/ఎంకామ్&ఎంబీఏ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఒంగోలులో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు.
    Telangana Teacher Jobs: తెలంగాణలో భారీగా తేలిన ఉపాధ్యాయ ఖాళీలు.. మొత్తం ఎన్ని?, నోటిఫికేషన్ ఎప్పుడంటే?



    ఇతర వివరాలు:
    -అభ్యర్థులు మొదటగా www.apssdc.in వెబ్ సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. -ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్ జిరాక్స్ ను వెంట తీసుకురావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
    -అభ్యర్థులు ఇతర పూర్తి వివరాల కోసం 9440635677 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Career and Courses, Job Mela, Job notification, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు