హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీ అర్హతతో ఆ సంస్థలో ఉద్యోగాలు.. రేపే ఇంటర్వ్యూలు

Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. డిగ్రీ అర్హతతో ఆ సంస్థలో ఉద్యోగాలు.. రేపే ఇంటర్వ్యూలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో జాబ్ మేళా(Job Mela)కు సంబంధించిన ప్రకటన విడుదలైంది. Shriram Transport Finance Company Limitedలో ఖాళీల భర్తీకి రేపు ఇంటర్వ్యూ(Interviews)లను నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు భారీగా ఉద్యోగావకాశాలను(Jobs) కల్పిస్తోంది. వరుసగా జాబ్ మేళా(Job Mela)లను నిర్వహిస్తోంది. తద్వారా అనేక ప్రైవేట్ సంస్థల్లో స్థానిక నిరుద్యోగులకు ఉపాధి(Employment) కల్పిస్తోంది APSSDC. తాజాగా Shriram Transport Finance Company Limited సంస్థలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను(Interviews) నిర్వహించనున్నట్లు APSSDC ప్రకటించింది. ట్రైనీ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. మొత్తం 25 ఖాళీలను (Job Vacancies) భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 12న ఒంగోలులో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని నోటిఫికేషన్లో తెలిపారు.

  విద్యార్హతల వివరాలు..

  ఏదైనా డిగ్రీ చేసిన వారు ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 27 ఏళ్ల లోపు ఉండాలని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.14 వేల వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. అయితే కేవలం పురుషులు మాత్రమే స్పష్టం చేశారు.

  IOCL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. IOCLలో 1968 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్

  ఇతర వివరాలు..

  అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో Resume, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, డ్రైవింగ్ లైసెన్స్, బైక్ ఆర్సీ, ఆధార్ కార్డ్, డిగ్రీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని నోటిఫికేషన్లో స్పస్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు ప్రకాశం జిల్లాలో పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే అభ్యర్థులు 9848667661 నంబర్ ను సంప్రదించాలని నోటిఫికేషన్లో సూచించారు.

  Oil India Recruitment 2021: ఆయిల్ ఇండియాలో 146 ఉద్యోగాలు.. నెలకు రూ. 1.45 లక్షల భారీ వేతనం.. ఇలా అప్లై చేయండి

  ఇంటర్వ్యూలు నిర్వహించే చిరునామా:

  D.No/37-1-169, 3 rd Floor, ARN Complex, Karnool Road, Ongole, Pincode-523002-Prakasham District.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Andhra Pradesh Government Jobs, Job notification, Private Jobs, State Government Jobs