Home /News /jobs /

ఏపీలో Kia Motors, Justdial సంస్థల్లో 200 ఉద్యోగాలు.. నెలకు రూ. 23 వేల వరకు వేతనం.. ఎల్లుండే ఇంటర్వ్యూలు

ఏపీలో Kia Motors, Justdial సంస్థల్లో 200 ఉద్యోగాలు.. నెలకు రూ. 23 వేల వరకు వేతనం.. ఎల్లుండే ఇంటర్వ్యూలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ప్రముఖ Kia Motors, Justdial సంస్థల్లో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను (interviews) నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు వరంలా మారింది. వరుసగా జాబ్ మేళా (Job Mela) లు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు APSSDC నుంచి ప్రకటన విడుదల చేసింది. ప్రముఖ కియా మోటార్స్ (Kia Motors), జస్ట్ డయల్(Just Dial) సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేసింది. ఈ జాబ్ మేళా (Job Mela) ద్వారా ఈ రెండు సంస్థల్లో 100 ఖాళీల చొప్పన మొత్తం 200 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కేవలం ఇంటర్వ్యూల (Interviews) ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

    ఖాళీలు విద్యార్హతల వివరాలు:
    Kia Motors: ఈ సంస్థలో మొత్తం 100 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. నీమ్ ట్రైనీ (Neem Trainee) విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు. ఏదైనా బ్రాంచ్ లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అర్హులని ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15 వేల వేతనంతో పాటు ఉచిత రవాణా సదుపాయం కల్పించనున్నారు. అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికన అభ్యర్థులు పెనుగొండలోని కియా ప్లాంట్ లో పని చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    Railway Jobs 2021: నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే శుభవార్త.. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

    Justdial: ఈ సంస్థలో మొత్తం 100 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ (Field Sales Executive) విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. డిగ్రీ లేదా పీజీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఏపీలోని ఏ ప్రాంతంలోనైనా పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థుల వయస్సు 20-30 ఏళ్లు ఉండాలని స్పష్టం చేశారు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 17,000 నుంచి రూ. 23 వేల వరకు వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. వేతంతో పాటు ఇన్సెంటీవ్స్+ఇన్సూరెన్స్ కవరేజీ ఉంటుందని వెల్లడించారు.
    Appsc Recruitment 2021 : ఏపీపీఎస్‌సీలో ఉద్యోగాలు.. జీతం రూ.75000, ప‌రీక్ష విధానం, అప్లికేష‌న్ ప్రాసెస్ వివ‌రాలు

    ఇతర వివరాలు..
    -అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు Resume, విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
    -అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9182920231, 7658902296 నంబర్లను సంప్రదించాలని సూచించారు.



    ఇంటర్వ్యూ వేధిక: ఇంటర్వ్యూలను ఈ నెల 4న Sri Sai Siddardha Degree College, Opp SBI Bank, 2nd Cross, Sainagar, Ananthapur చిరునామాలో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ రోజు ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Job notification, JOBS, KIA Motors, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు