ANDHRA PRADESH INTERMEDIATE BOARD RELEASED NEW INTER EXAMS SCHEDULE FULL DETAILS HERE PRN GNT
AP Inter Exams Schedule: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ కొత్త షెడ్యూల్ ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ (Intermediate Exams Schedule) విడుదల చేసింది. ఇప్పటికే పరీక్షలను వాయిదా వేసిన ఇంటర్ బోర్డు.. కొత్త షెడ్యూల్ విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ (Intermediate Exams Schedule) విడుదల చేసింది. ఇప్పటికే పరీక్షలను వాయిదా వేసిన ఇంటర్ బోర్డు.. కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. తొలుత ఏప్రిల్ 22 నుంచి మే 12వరకు పరీక్షలు నిర్వహించాలని చూసినా.. జేఈఈ పరీక్షల (JEE Exams) కారణంగా వాయిదా వేసింది. తాజాగా కొత్త తేదీలను విడుదల చేసింది. మే 6వ తేదీ నుంచి మే 24 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు మే 6న ప్రారంభమై.. మే 23వ తేదీతో ముగుస్తాయి. సెకండ్ ఇయర్ పరీక్షలు మే 7వ తేదీ నుంచి మే 24 వరకు జరుగుతాయని షెడ్యూల్లో పేర్కొంది. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తాయి.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్
మే 6వ తేదీ సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
మే 9వ తేదీ ఇంగ్లీష్ పేపర్-1
మే 11వ తేదీ మ్యాథ్స్ పేపర్-1A, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1
మే 13వ తేదీ మ్యాథ్స్ పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
మే 16వ తేదీ ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
మే 18వ తేదీ కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1, సోషియాలజీ పేపర్-1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-1
మే 20వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1, మ్యాథ్స్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు)
మే 23వ తేదీ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-1, జియాగ్రఫీ పేపర్-1
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ షెడ్యూల్
మే 7వ తేదీ సెకండ్ లాంగ్వేష్ పేపర్-II
మే 10వ తేదీ ఇంగ్లిష్ పేపర్-II
మే 12వ తేదీ మ్యాథ్స్ పేపర్-II-A
మే 14న తేదీ మ్యాథ్స్ పేపర్-II-B, జువాలజీ పేపర్-II, హిస్టరీ పేపర్-II
మే 17వ తేదీ ఫిజిక్స్ పేపర్-II, ఎకనామిక్స్ పేపర్-II
మే 19వ తేదీ కెమిస్ట్రీ పేపర్-II, కామర్స్ పేపర్-II , సోషియాలజీ పేపర్-II, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్-II
మే 21వ తేదీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-II, లాజిక్ పేపర్-II, మ్యాథ్స్ పేపర్-II (బైపీసీ విద్యార్థులకు)
మే 24వ తేదీ మోడర్న్ లాంగ్వేజ్ పేపర్-II, జియోగ్రఫీ పేపర్-II
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.