హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Inter Exams: ఈ రోజు నుంచే ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్.. విద్యార్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే..

Inter Exams: ఈ రోజు నుంచే ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్.. విద్యార్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP Inter Practical Exams: ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఎలాంటి అవకతవకలు జరకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రాక్టికల్‌ పరీక్షలను ఈ నెల 31(ఈ రోజు) నుంచి ఏప్రిల్‌ 24 వరకు నిర్వహించనున్నారు. ఈ ప్రాక్టికల్ పరీక్షలకు ఎంపీసీ విద్యార్థులు 2,60,012 మంది, బైపీసీకి చెందిన 98,462 మంది హాజరుకానున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వీరికి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఈ పరీక్షలకు 3,58,474 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. వీరికి 947 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష జరగనుంది. విద్యార్థులు bie.ap.gov.in వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేటు కాలేజీల్లో ఏర్పాటు చేయనున్న పరీక్షా కేంద్రాలకు ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలకు చెందిన అధ్యాపకులను చీఫ్ సూపరింటెండెంట్లుగా నియమిస్తున్నారు. దీంతో పాటు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాట్లు చేస్తున్నారు.

కరోనా ఉన్న వారికి వేరుగా పరీక్షలు..

పరీక్షలను కరోనా నిబంధనలు పాటిస్తూ నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ విద్యార్థి కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. మాస్కు లేనిదే పరీక్షా కేంద్రంలోని అనుమతి ఉండదని చెప్పారు. కరోనాతో బాధపడుతున్న వారికి వేరుగా పరీక్షలు నిర్వహించనున్నారు. బ్యాచ్ లోని 20 మంది విద్యార్థుల్లో 10 మందికి ఒక సారి, మిగతా పది మందికి మరో సారి వేర్వేరుగా పరీక్షలు నిర్వహించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఏపీలోని మహిళల ఖాతాల్లోకి త్వరలోనే డబ్బులు జమచేయనుంది జగన్ ప్రభుత్వం. పిల్లలను కాలేజీలకు పంపించే తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమకానున్నాయి. ఇందుకు సీఎం వైఎస్ జగన్ ముహూర్తం ఖరారు చేశారు. జగనన్న విద్యాదీవెనపై ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్‌తో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఏప్రిల్ 9న జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఇవ్వాలని చెప్పారు సీఎం వైఎస్ జగన్. ఏప్రిల్ 27న వసతిదీవెన డబ్బులు జమచేయాలని సూచించారు. ఆయా రోజుల్లో ఈ ఏడాదికి సంబంధించి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన, వసతి డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకాల ద్వారా దాదాపు 10 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

First published:

Tags: AP inter board, Exams, Intermediate exams

ఉత్తమ కథలు