Inter Exams : ఏపీ ఇంటర్ ఫస్టియర్ జువాలజీ 2019 పరీక్షా ప్రశ్నపత్రం

Inter Exams Question Paper : ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గరపడుతుండడంతో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం గతంలో వచ్చిన ప్రశ్నాపత్రాలను ‘News18 Telugu’ ప్రత్యేకంగా అందిస్తోంది.

news18-telugu
Updated: February 14, 2020, 11:11 AM IST
Inter Exams : ఏపీ ఇంటర్ ఫస్టియర్ జువాలజీ 2019 పరీక్షా ప్రశ్నపత్రం
Inter Exams : ఏపీ ఇంటర్ ఫస్టియర్ జువాలజీ 2019 పరీక్షా ప్రశ్నపత్రం
  • Share this:

Part - III
ZOOLOGY, Paper-I
(Telugu Version)



Time : 3 Hours                                                                                                       Max. Marks : 60

గమనిక : ఈ క్రింద ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదవండి.


1) విభాగము = 'A' లోని అన్ని ప్రశ్నలకు, విభాగం - 'B' లోని ఆరు ప్రశ్నలకు, విభాగం - 'C' లోని రెండు ప్రశ్నలకు మాత్రమే సమాధానములు వ్రాయవలెను.
(2) విభాగము - 'A' లోని ప్రశ్నల సంఖ్య 1 నుండి 10 వరకు గల ప్రశ్నలు "అతి స్వల్ప"సమాధాన ప్రశ్నలు. వీటికి సమాధానములు 5 పంక్తులకు పరిమితము. ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కులు. ఈ సమాధానములు ఒకే చోట వరుస క్రమములో వ్రాయవలెను.
(3) విభాగము - 'B' లోని ప్రశ్నల సంఖ్య 11 నుండి 18 వరకు గల ప్రశ్నలు "స్వల్ప" సమాధాన ప్రశ్నలు. వీటికి సమాధానము 20 పంక్తులకు పరిమితము. ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు మార్కులు.
(4) విభాగము - 'C' లోని ప్రశ్నల సంఖ్య 19 నుండి 21 వరకు “దీర్ఘ" సమాధాన ప్రశ్నలు. ప్రతి సమాధానము 60 పంక్తులకు పరిమితము. ఒక్కొక్క ప్రశ్నకు ఎనిమిది మార్కులు.
(5) విభాగము - 'B' మరియు విభాగము - "C" ల లోని ప్రశ్నలకు అవసరమైన చోట
పటములు గీసి, భాగములు పేర్కొనుము.

విభాగము - A                                                                                          10 X 2 = 20
సూచన : ఈ క్రింది అన్ని ప్రశ్నలకు 5 పంక్తులలో సమాధానాలు వ్రాయండి.
1. కణజాల శాస్త్రాన్ని నిర్వచించండి. దీనికి గల మరొక పేరు ఏమిటి ?
2. నెమ్మదిగా చలించే జీవులకు లేదా వృంత రహిత జీవులకు వ్యాసార్ధ సౌష్టవం అనుకూలనం నిరూపించండి.
3. స్నాయువు, స్నాయు బంధనం మధ్య తేడాలను తెల్పండి.
4. హిమాటోక్రిట్ విలువ అంటే ఏమిటి ?
5. ఆంఫీలు, ఫాస్మిడ్ల మధ్య భేదాన్ని తెలపండి.
6. వాతిలాస్థులు అంటే ఏమిటి ? అవి పక్షులుకు ఎలా తోడ్పడతాయి ?
7. కశాభానికీ, శైలికకీ మధ్య రెండు భేదాలు రాయండి.
8. అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం ద్వారా ఏర్పడిన పిల్ల జీవులను 'క్లోన్' అని ఎందుకు అంటారు ?
9. ఆస్కారిస్ గుడ్లను 'మామ్మిల్లేటిడ్ గుడ్లు' అని ఎందుకు అంటారు ?
10. భ్రమణరూప విక్రియ అంటే ఏమిటి ? డాఫ్నియాలో దాని ప్రాముఖ్యం వివరించండి.

విభాగము - B                                                                                                              6x4= 24
సూచన : ఈ క్రింది వానిలో ఏవైనా ఆరు ప్రశ్నలకు 20 పంక్తులలో సమాధానములు వ్రాయుము.
11. "బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్" గురించి లఘుటీక రాయండి..
12. బహుధ్రువ న్యూరాన్ నిర్మాణం వివరించండి.
13. ఎకినాయిడ్స్ ప్రధాన లక్షణాలను పేర్కొనండి.
14. చేపలను ఇతర సకశేరుకాల నుంచి వేరు చేసే ఎనిమిది లక్షణాలను రాయండి.
15. మిథ్యాపాదాల గురించి ఒక వ్యాఖ్య రాయండి.
16. పొగాకు వల్ల జరిగే దుష్పరిణామాలను తెలపండి.
17. బొద్దింక లాలాజల పరికరపు చక్కని పటాన్ని గీసి, భాగాలను గుర్తించండి.
18. స్టాటోస్పియర్ లో ఓజోన్ క్షీణత వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏమిటి ?

విభాగము -C                                                                                                     2x8 = 16
సూచన : ఈ క్రింది వానిలో ఏవైనా రెండు ప్రశ్నలకు సమాధానములను 60 పంక్తులలో వ్రాయుము.
19. దోమలో ప్లాస్మోడియం వైవాక్స్ జీవిత చక్రాన్ని పటం సహాయంతో వివరించండి.
20. బొద్దింకలో శ్వాస వ్యవస్థను భాగాలు గుర్తించిన చక్కని పటం సహాయంతో వర్ణించండి.
21. జీవావరణ వ్యవస్థలో కనిపించే వివిధ ఆహార గొలుసులను వివరించండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు