Inter Exams : ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫిజిక్స్ 2019 పరీక్షా ప్రశ్నపత్రం

Inter Exams Question Paper : ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గరపడుతుండడంతో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం గతంలో వచ్చిన ప్రశ్నాపత్రాలను ‘News18 Telugu’ ప్రత్యేకంగా అందిస్తోంది.

news18-telugu
Updated: February 14, 2020, 12:25 PM IST
Inter Exams : ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫిజిక్స్ 2019 పరీక్షా ప్రశ్నపత్రం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:

Part-III
PHYSICS, Paper-I


(Telugu Version)



Time : 3 Hours                                                                                       Max. Marks : 60

SECTION - A                                                                                                           10x2= 20
సూచనలు : (i) అన్ని ప్రశ్నలకు సమాధానము వ్రాయండి.
(ii) ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు.(iii) అన్ని "అతి స్వల్ప" సమాధాన తరహావి.

1. సి.వి. రామన్ ఆవిష్కరణ ఏమిటి ?
2. గోళం వ్యాసార్థం కొలవడంలో దోషం 1% అయితే గోళం ఘణపరిమానము కొలవడములో దోషము ఎంత ?
3. ఒక సదిశ నిలువు అంశం దాని క్షితిజ సమాంతర అంశానికి సమానము. ఆ సదిశ X-అక్షముతో చేసే కోణము ఎంత ?
4. జడత్వము అంటే ఏమిటి ? జడత్వ కొలతను ఏది ఇస్తుంది ?
5. ఒక ఆటోమొబైల్ యొక్క కార్బ్యురేటర్ పనిచేయడం వెనుక ఉన్న సూత్రం ఏది ?
6. ద్రవము లోపల వుండే గాలి బుడగలోని అదనపు పీడనముకు సమీకరణము తెలపండి.
7. సెల్సియస్, ఫారన్ హీట్ ఉష్ణోగ్రతా మానాలలో అథో, ఊర్ధ్వ స్థిర విలువలను  తెల్పండి.
8. రైల్వే ట్రాక్ పై రెండు వరుస పట్టాల మధ్య ఖాళీ ప్రదేశము ఎందుకు వదులుతారు ?
9. స్వేచ్ఛా పథ మద్యమమును నిర్వచించండి.
10. నిజ వాయువు ఆదర్శవాయువు లాగా ఎప్పుడు ప్రవర్తిస్తుంది?

SECTION-B                                                                                                        6x4= 24
సూచనలు : (i) ఏవైనా ఆరు ప్రశ్నలకు సమాధానము వ్రాయండి.
(ii) ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు.
(iii) అన్ని “స్వల్ప” సమాధాన తరహావి.

11. ఒక్కడు ఒక్క తిన్నని రోడ్డు వెంట తన ఇంటి నుంచి 2.5 km దూరాన ఉన్న మార్కెట్ కు 5 kmh వడితో నడిచాడు. మార్కెట్ మూసి ఉండడం గమనించి, వెంటనే వెనుదిరిగి ఇంటికి 7.5 kmh వేగంతో చేరాడు. 0 నుండి 50 నిముషాల కాలవ్యవధిలో అతడి (a) సగటు వేగ పరిమాణములు (b) సగటు వడి ఎంత ?
12. సగటు వేగము, తాక్షిణక వేగము పదాలను వివరించండి. ఈ రెండూ ఎప్పుడు సమానము అవుతాయి ? 13. న్యూటన్ రెండవ గమన నియమము తెల్పండి. దాని నుండి గమన సమీకరణము F= ma ను రాబట్టండి. 14. కోణీయ వేగముకు నిర్వచనము తెలపండి. V = rea ను రాబట్టండి.
15. కోణీయత్వరణము, టార్క్ ను నిర్వచించండి. ఈ రెండు రాశుల మధ్య  సంబంధమును తెలిపే సమాసాన్ని రాబట్టండి.
16. పలాయన వడి అంటే ఏమిటి ? దానికి సమీకరణము ఉత్పాదించండి.
17. ప్రతిబలము నిర్వచనము తెలిపి, వివిధ రకాల ప్రతిబలాలును వివరించండి.
18. వహానము, సంవహానము, వికిరణాలను ఉదాహరణలతో వివరించండి.

SECTION - C                                                                                                                     2x8 = 16
సూచనలు : (i) ఏ రెండు ప్రశ్నలకైన సమాధానము వ్రాయుము. (ii) ప్రతి ప్రశ్నకు ఎనిమిది మార్కులు.
(iii) అన్ని “దీర్ఘ" సమాధాన తరహావి.

19. అభిఘాతాలు అంటే ఏమిటి ? వాటిలో సాధ్యమయ్యే రకాలును వివరించండి. ఏకమితీయ స్థితిస్థాపక అభిఘాతాల సిద్ధాంతాన్ని వివరించండి.
20. సరళహారాత్మక చలనమును నిర్వచించండి. ఏకరీతి వృత్తాకార చలనము చేసే కణము విక్షేపము(ఏదైనా) వ్యాసంపై సరళహారాత్మక చలనము చేస్తుందని చూపండి.
మానవ గుండె, సగటు స్పందన రేటు నిముషానికి 75. గుండె పౌనఃపున్యము, ఆవర్తన
కాలమును లెక్కించండి.
21. ఉష్ణగతిక శాస్త్ర రెండవ నియమాన్ని నిర్వచించండి. ఉష్ణ యంత్రము, శీతలీకరణ యంత్రం కంటే ఏ విధంగా భిన్నమయిందో వివరించండి ?
Published by: Narsimha Badhini
First published: February 14, 2020, 12:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading