Inter Exams : ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఎకనామిక్స్ 2019 పరీక్షా ప్రశ్నపత్రం

Inter Exams Question Paper : ఇంటర్మీడియట్ పరీక్షలు దగ్గరపడుతుండడంతో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం గతంలో వచ్చిన ప్రశ్నాపత్రాలను ‘News18 Telugu’ ప్రత్యేకంగా అందిస్తోంది.

news18-telugu
Updated: February 14, 2020, 2:46 PM IST
Inter Exams : ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఎకనామిక్స్ 2019 పరీక్షా ప్రశ్నపత్రం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:

Part-III
ECONOMICS, Paper-I
(Telugu Version)



Time: 3 Hours                                                                                            Max. Marks : 100
గమనిక : ఈ క్రింది సూచనలను జాగ్రత్తగా చదవండి.
(i) ఎంపికను అనుసరించి అన్ని ప్రశ్నలకు సమాధానము వ్రాయండి. అవసరం అయినచోట రేఖా పటములు గీయండి.


(ii) వరుస సంఖ్య 1 నుండి 5 వరకు భాగము - 'A' లో ఇవ్వబడినవి. 'వ్యాసరూప'సమధానములు వ్రాయవలసినవి. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు. 5 ప్రశ్నలలో ఏ మూడింటికైనా సమాధానములు ఇమ్ము. ప్రతి సమాధానము 40 పంక్తులకు పరిమితము.
(iii) వరుస సంఖ్య 6 నుండి 17 వరకు భాగము - 'B' లో ఇవ్వబడిన 'లఘు' సమధానములు వ్రాయవలసినవి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. 12 ప్రశ్నలలో ఏ ఎనిమిదింటికైనా సమాధానములు ఇమ్ము. ప్రతి సమాధానము 20 పంక్తులకు పరిమితము.
(iv) వరుస సంఖ్య 18 నుండి 37 వరకు భాగము - 'C' లో ఇవ్వబడినవి 'సంక్షిప్త సమధానములు వ్రాయవలసినవి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. 20 ప్రశ్నలలో ఏ పదిహేనుకైనా సమాధానములు ఇమ్ము. ప్రతి సమాధానము 5 పంక్తులకు పరిమితము.

భాగము - A                                                                                                            3x 10 = 30
సూచన : ఈ క్రింది ఐదు ప్రశ్నలలో ఏ మూడింటికైనా సమాధానములు వ్రాయండి.
1. ఉదాసీనతా వక్రరేఖల పద్ధతి ద్వారా వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించండి.
2. అంతర్గత, బహిర్గత ఆదాలను గురించి రాయండి.
3. సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర నిర్ణయాన్ని గురించి వివరించండి.
4. జాతీయాదాయాన్ని నిర్వచించి, వివిధ జాతీయాదాయ భావనలను వివరించండి.
5. వివిధ రుణ విమోచనా పద్ధతులను వివరించండి.

భాగము - B                                                                                                        8×5= 40
సూచన : ఈ క్రింది ప్రశ్నలలో ఏ ఎనిమిదింటికైనా సమాధానము లిమ్ము.
6. ప్రయోజనము అనగా నేమి ? వివిధ రకాల ప్రయోజనాలను వివరించండి.
7. ఉచిత వస్తువులు, ఆర్థిక వస్తువుల మధ్య తేడాలను పేర్కొనండి.
8. ధర రేఖ లేదా బడ్జెట్ రేఖ గురించి రాయండి.
9. డిమాండ్ రేఖ ఎందుకని ఎడమ నుంచి కుడికి లేదా ఋణాత్మక వాలు కలిగి ఉంటుంది ?
10. ధర డిమాండు వ్యాకోచత్వ రకాలను వివరించండి.
11. స్థూల వడ్డీ, నికర వడ్డీ భావనలను వివరించి, స్థూల వడ్డీలో, నికర వడ్డీలో గల అంశాలను వివరించండి.
12. జనాభా, తలసరి ఆదాయం మధ్యగల సంబంధం ఏమిటి ?
13. పిగూ 'వేతన కోత విధానం గురించి వివరించండి.
14. వివిధ ప్రభుత్వ రాబడి మార్గాల గురించి వ్రాయండి.
15. రిజర్వు బ్యాంకు విధుల గురించి రాయండి.
16. ద్రవ్యోల్బణం రకాలను తెలపండి.
17. గణాంక శాస్త్ర ప్రాధాన్యాన్ని వివరించండి.

భాగము - C                                                         15x2= 30
సూచన : ఈ క్రింది ప్రశ్నలలో ఏ పదిహేనీంటికైనా సమాధానములు వ్రాయండి.
18. సంపద
19. ఎంపిక సమస్య
20. ఆర్డినల్ ప్రయోజనము
21. గిఫెన్ వైపరీత్యం
22. ఆర్క్ పద్ధతి
23. సప్లయ్ సూత్రం
24. మార్కెట్
25. ధర విచక్షణ
26. కాంట్రాక్టు లేక ఒప్పంద భాటకం
27. వాస్తవిక వేతనం
28. నికర లాభం
29. సే మార్కెట్ సూత్రం
30. సార్థక డిమాండు
31. విలువల నిధి
32. సమీప ద్రవ్యం
33. ఓవర్ డ్రాఫ్ట్
34. కరెన్సీ
35. అంక మధ్యమం
36. వృత్త చిత్రం
37. సాధారణ బార్ పటం
First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు