హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP 10th Inter Exams: ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే..?

AP 10th Inter Exams: ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే..?

ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్

ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్

AP Inter and SSC Exams: ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్, పది పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యింది. కరోనా పరిస్థితులు అన్నింటినీ ఆలోచించే.. పరీక్షలపై నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ప్రకటించింది..

Ap Inter-SSC Exams: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యార్థులకు గుడ్ న్యూస్.. పది, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ (10th, Inter Exams Schedule) విడుదల అయ్యింది. మంత్రులు ఆదిమూలపు సురేష్ (Adimulapu Suresh), బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) ఈ పరీక్షల తేదీలను విడుదల చేశారు. ఏపీలో మే 2వ తేదీ నుంచి మే 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఇంటర్ పరీక్షలను ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పాటు మార్చి 11 నుంచి 31వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహిస్తామన్నారు.. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ (Corona Virus ) అందర్నీ భయపెడుతోంది.. వీటన్నింటినీ ఆలోచించే పరీక్షల తేదీపై పూర్తి నిర్ణయం తీసుకున్నామన్నారు మంత్రులు.. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. కోవిడ్ ప్రొటోకాల్ పాటించే లా చర్యలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహిస్తామని.. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు మంత్రులు..

ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పదో తరగతి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ మాత్రం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ జరుగుతాయని తెలిపారు. అయితే కరోనా పరిస్థితులు.. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎగ్జామ్స్ పెట్టడం అవసరమని విద్యాశాఖ మంత్రి సురేష్ స్పష్టం చేశారు.

పదవ తరగతి షెడ్యూల్ ఇదే

కరోనా కొత్త నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీలు నడిపిస్తున్నామని ఆయన తెలిపారు. ఎగ్జామ్స్ కూడా కరోనా నిబంధలను పాటిస్తూ నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే నిర్వహణపై అప్పటి కరోనా నిబంధనలు.. పరిస్థితుల బట్టి పూర్తి నిర్ణయలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది..

ఇంటర్ ఎగ్జామ్ షెడ్యూల్

మరోవైపు  ఏపీలో సెట్ పరీక్షల నిర్వహణతో పాటు చైర్మన్లను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఏపి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఈఏపీ సెట్‌ 2022 ను మే నెలలలో నిర్వహించనున్నారు. దీని నిర్వాహణ బాధ్యతను అనంతపురం జేఎన్టీయూకి అప్పగించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల నిర్వహించేందుకు చైర్మన్లు, కన్వీనర్లను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చదవండి : జగన్ అన్న పాలన అంటే ఇదే.. విశాఖలో పరిస్థితిపై వీడియో వైరల్

ఈఏపీ సెట్‌కు చైర్మన్, కన్వీనర్లుగా అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్‌ జి.రంగజనార్దన , ప్రొఫెసర్‌ ఎమ్‌.విజయకుమార్ లను నియమించారు. ఈసెట్‌కు కాకినాడ జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు, ప్రొఫెసర్‌ కృష్ణమోహన్ లను నియమించగా ఐసెట్‌కు ఏయూ వీసీ ప్రొఫెసర్‌ పీవీజీడీ ప్రసాదరెడ్డి, ప్రొఫెసర్‌ ఎన్‌.కిశోర్‌బాబు లను, పీజీ ఈసెట్‌కు ఎస్వీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ కె.రాజారెడ్డి, ప్రొఫెసర్‌ ఆర్వీఎస్‌ సత్యనారాయణ లను, రీసెర్చ్‌ సెట్‌కు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, ప్రొఫెసర్‌ డి.అప్పలనాయుడు లను నియమించారు.

ఇదీ చదవండి : అవును నేను దత్తపుత్రుడ్నే.. సీఎం జగన్ కౌంటర్ కు పవన్ రియాక్షన్.. ఏమన్నారంటే..?

ఎడ్‌సెట్‌కు పద్మావతీ మహిళా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ డి.జమున, ప్రొఫెసర్‌ టీజీ అమృతవల్లిలను పీజీ సెట్‌కు యోగివేమన వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఎమ్‌.సూర్యకళావతి, ప్రొఫెసర్‌ ఎన్‌.నజీర్‌ అహ్మద్ లను , లాసెట్‌కు పద్మావతీ మహిళా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ డి.జమున, ప్రొఫెసర్‌ టి.సీతాకుమారిలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయా సెట్లకు సంబంధించి నోటిఫికేషన్లు, పరీక్ష తేదీలు ఖరారు చేయాల్సి ఉంది.

First published:

Tags: 10th Class Exams, Andhra Pradesh, AP inter board, Ap minister suresh, AP News, Buggana Rajendranath reddy

ఉత్తమ కథలు