సేకరణ: భాను ప్రసాద్, న్యూస్18 కరస్పాండెంట్, విజయనగరం
రచయిత: ఏ.గౌరీప్రసాద్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, గుర్లా
ఏపీలో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ జువాలజీ సిలబస్ లో మొత్తం 8 యూనిట్లు ఉంటాయి. ఇందులో కోవిడ్ కారణంగా 30 శాతం సిలబస్ ను తగ్గించారు. కొన్ని యూనిట్లలో ఉన్న చాప్టర్ల నుండి కొన్ని అంశాలను (సబ్ టాపిక్స్ )ను తీసేయగా, మిగిలిన సిలబస్ నుంచి మాత్రమే ప్రశ్నాపత్రం వస్తుంది.
1) మానవ శరీర నిర్మాణ శాస్త్రం & శరీర ధర్మశాస్త్రం (హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ-1)(HUMAN ANATOMY AND PHYSIOLOGY-1) లో రెండు సబ్ యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 1ఏగా జీర్ణక్రియ, శోషణం (డైజెస్టన్ అండ్ అబ్జార్ప్షన్) (DIGESTION AND ABSORPTION, యూనిట్ 1బీ గా శ్వాసించడం, వాయువుల వినిమయం (బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ (BREATING AND EXCHANGE OF GASES) అనే చాప్టర్స్ ఉన్నాయి.
2) మానవ శరీర నిర్మాణ శాస్త్రం & శరీర ధర్మశాస్త్రం-2 (హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ-2) (HUMAN ANATOMY AND PHYSIOLOGY-2) లో రెండు చాప్టర్స్ ఉన్నాయి. యూనిట్ 2ఏ గా శరీర ద్రవాలు, ప్రసరణ (బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్) (BODY FLUIDS AND CIRCULATION), యూనిట్ 2బీగా విసర్జక పదార్ధాలు, వాటి విసర్జన (ఎక్సెర్టరీ ప్రోడక్ట్స్ అండ్ దెయిర్ ఎలిమినేషన్) (EXCERTORY PRODUCTS AND THEIR ELIMINATION) ఉన్నాయి.
3)మానవ శరీర నిర్మాణ శాస్త్రం & శరీర ధర్మశాస్త్రం-3 (హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ-2) (HUMAN ANATOMY AND PHYSIOLOGY-3) లో రెండు సబ్ యూనిట్స్ ఉన్నాయి. యూనిట్ 3ఏ గా కండర-అస్థిపంజర వ్యవస్ధ (మాస్కులర్ అండ్ స్కెలిటల్ సిస్టమ్) (MUSCULAR AND SKELETAL SYSTEM), యూనిట్ 3బీగా నాడీ నియంత్రణ, సమన్వయం (న్యూరాల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్) (NURAL CONTROL AND COORDINATION) అనే చాప్టర్స్ ఉన్నాయి.
4) మానవ శరీర నిర్మాణ శాస్త్రం & శరీర ధర్మశాస్త్రం4 (హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ-4) (HUMAN ANATOMY AND PHYSIOLOGY-4)లో యూనిట్ 4బీ గా రోగ నిరోధక వ్యవస్థ (ఇమ్యూన్ సిస్టమ్) (IMMUNE SYSTEM) అనే రెండు చాప్టర్స్ ఉన్నాయి.
5) మానవ ప్రత్యుత్పత్తి (హ్యూమన్ రీప్రొడక్షన్) (HUMAN REPRODUCTION)లో యూనిట్ 5ఏ గా మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ (హ్యూమన్ రీప్రొడక్టవ్ సిస్టమ్) (HUMAN REPRODUCTIVE SYSTEM), యూనిట్ 5బీ గా ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం (రీప్రొడక్టివ్ హెల్త్) (REPRODUCTIVE HEALTH) అనే చాప్టర్స్ ఉన్నాయి.
6) జన్యు శాస్త్రం (జెనెటిక్స్)(GENETICS) అనే ఒకే ఒక్క చాప్టర్ ఉంది.
7) జీవ పరిణామం (ఆర్గానిక్ ఎవల్యూషన్) (ORGANIC EVOLUTION) ఉంది. ఈ చాప్టర్ ను ఎగ్జామ్ టాపిక్స్ నుండి తొలగించారు.
AP Inter 2nd year Chemistry: ఏపీ ఇంటర్ సెకండియర్ కెమిస్ట్సీ సిలబస్ ఇదే..
8) అనువర్తిత జీవశాస్త్రం (అప్లయిడ్ బయాలజీ) (APPLIED BIOLOGY) అనే చాప్టర్ ఉంది. తొలగించిన టాపిక్స్..ఇంటర్ సెకండ్ ఇయర్ జువాలజీ లో ఎనిమిది యూనిట్లు ఉంటాయి. వీటిలో కోవిడ్ కారణంగా 7వ యూనిట్ అయిన జీవ పరిణామం(ఆర్గానిక్ ఎవల్యూషన్) (ORGANIC EVOLUTION)ను పూర్తిగా తొలగించారు. 1వ యూనిట్ నుండి యూనిట్ 1ఏ గా ఉన్న జీర్ణక్రియ, శోషణం (డైజెస్టన్ అండ్ అబ్జార్షన్) (DIGESTION AND ABSORPTION) ను పూర్తిగా తొలగించారు. 3వ యూనిట్ నుండి యూనిట్ 3ఏ గా ఉన్న కండర-అస్థిపంజర వ్యవస్థ (మాస్కులో స్కెలెటిల్ సిస్టమ్) (MUSCULO SKELETAL SYSTEM) లోని కొన్ని అంశాలను, యూనిట్ 3బీగా నాడీ నియంత్రణ, సమన్వయం (న్యూరాల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్) (NURAL CONTROL AND COORDINATION) అనే చాప్టర్ నుండి కొన్ని అంశాలను తొలగించారు.
8వ యూనిట్ అనువర్తిత జీవశాస్త్రం (అప్లయిడ్ బయాలజీ) (APPLIED BIOLOGY) అనే చాప్టర్ నుండి యానిమల్ హజ్భండరీ, పౌల్ట్రీ ఫామ్ మేనేజ్ మెంట్, బీ కీపింగ్, ఫిషరీ మేనేజ్మెంట్ అనే అంశాలను తొలగించారు. ఇలా తగ్గించగా మిగిలిన వాటి నుండి మాత్రమే క్వశ్చన్ పేపర్ వస్తుంది. కొంచెం ప్లాన్డ్ గా, జాగ్రత్తగా చదివితే.. సెకండ్ ఇయర్ జువాలజీ లో అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉందని, జువాలజీ సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. ప్లాన్డ్ గా చదవడం, ఆ చదివినదాన్ని గుర్తు పెట్టుకోవడం కోసం, పరీక్షలో తడబాటు లేకుండా రాయడం కోసం.. చదివిన తర్వాత.. పేపర్ మీద ప్రెజెంట్ చేస్తే మంచిది. ప్రతీదీ ఎగ్జామ్స్ తరహాలో ముందునుండే ప్రాక్టీస్ చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు.
జువాలజీ సెకండ్ ఇయర్ ప్రశ్నాపత్రంలో మొత్తం 60 మార్కులు ఉంటాయి. ఇందులో మొదటగా రెండు 8 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంది. మూడు ప్రశ్నలు ఇచ్చి, ఒకటి ఛాయిస్ గా ఇస్తారు. ఇక ఆరు 4 మార్కుల ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. 8 ప్రశ్నలు అడుగుతారు. రెండు ప్రశ్నలు ఛాయిస్ ఉంటాయి. పది 2 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పది ప్రశ్నలు ఇస్తారు. ఇక్కడ ఛాయిస్ ఉండదు. మొదట 8 మార్కుల ప్రశ్నలకు సంబంధించి ఒక ఛాయిస్ క్వశ్చన్ తో పాటు మొత్తం మూడు ప్రశ్నలు ప్రశ్నాపత్రంలో ఇస్తారు. వీటిలో రెండు రాయాల్సి ఉంది. జాగ్రత్తగా చదివితే ఈ రెండు ప్రశ్నలు రాసేయవచ్చు.
ప్రశ్నాపత్నంలో వచ్చే మూడు 8 మార్కుల ప్రశ్నల విషయానికి వస్తే.. రెండవ యూనిట్ అయిన మానవ శరీర నిర్మాణ శాస్త్రం & శరీర ధర్మశాస్త్రం-2 (హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ-2) (HUMAN ANATOMY AND PHYSIOLOGY-2) లో రెండు చాప్టర్స్ నుండి రావచ్చు. మరో 8 మార్కుల ప్రశ్న 5వ యూనిట్ మానవ ప్రత్యుత్పత్తి (హ్యూమన్ రీప్రొడక్షన్) ( HUMAN REPRODUCTION)లోని మూడు చాప్టర్స్ నుండి వస్తుంది. ఇక మూడవ 8 మార్కుల ప్రశ్న 6వ యూనిట్ అయిన జన్యు శాస్త్రం (జెనెటిక్స్) (GENETICS) అనే చాప్టర్ నుండి వస్తుంది. ఇక ప్రశ్నాపత్రంలో 4 మార్కుల ప్రశ్నలు 6 రాయాల్సి ఉంటుంది. మొత్తం 8 ప్రశ్నలు అడుగుతారు. రెండు ఛాయిస్ ఉంటాయి.
ముఖ్యంగా ఈ 4 మార్కుల ప్రశ్నలు.. మొదటి యూనిట్ అయిన మానవ శరీర నిర్మాణ శాస్త్రం & శరీర ధర్మశాస్త్రం-1 (HUMAN ANATOMY AND PHYSIOLOGY-1) లోని రెండవ చాప్టర్ అయిన శ్వాసించడం, వాయువుల వినిమయం (బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్) (BREATING AND EXCHANGE OF GASES) నుండి వస్తుంది. 2వ యూనిట్ మానవ శరీర నిర్మాణ శాస్త్రం & శరీర ధర్మశాస్త్రం-2 (HUMAN ANATOMY AND PHYSIOLOGY-2) లో రెండు చాప్టర్స్ లో ఏదో ఒక చాప్టర్ నుండి రావచ్చు. 3వ యూనిట్ మానవ శరీర నిర్మాణ శాస్త్రం & శరీర ధర్మశాస్త్రం-3 (HUMAN ANATOMY AND PHYSIOLOGY-3) లో ఉన్న రెండు సబ్ యూనిట్స్ నుండి ఒక 4 మార్కుల ప్రశ్న వస్తుంది. 4వ యూనిట్ మానవ శరీర నిర్మాణ శాస్త్రం & శరీర ధర్మశాస్త్రం-4 (HUMAN ANATOMY AND PHYSIOLOGY-4)లోని రెండు చాప్టర్ ల నుండి రెండు 4 మార్కుల ప్రశ్నలు వస్తాయి.
6వ యూనిట్ జన్యుశాస్త్రం జెనెటిక్స్(GENETICS) నుండి రెండు 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. 8వ యూనిట్ అనువర్తిత జీవశాస్త్రం (APPLIED BIOLOGY) నుండి ఒక 4 మార్కుల ప్రశ్న వస్తుంది. ప్రధానంగా ఈ 4 మార్కుల ప్రశ్నల్లో రెండు ప్రశ్నలు మాత్రం కొంచెం వైవిద్యంగా అడగవచ్చు. ఏవైనా రెండు అంశాలు ఇచ్చి వాటిమధ్య తేడాలు(డిఫరెన్సెస్) ఏంటి? అని అడగొచ్చు. డయాగ్రామ్ లు గీయమని అడుగుతారు. కాబట్టి ఈ అంశాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రెండు మార్కుల ప్రశ్నలకు సంబంధించి ప్రశ్నాపత్రంలో పది 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. పది కూడా సమాధానాలు రాయాల్సి ఉంటుంది. వీటిలో ఛాయిస్ ఉండదు. మొదటి యూనిట్ , రెండవ యూనిట్ ల నుండి ఒక్కొక్క 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఇక మూడు, నాలుగు, ఐదు, ఎనిమిదవ యూనిట్ల నుండి రెండేసి 2 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వీటన్నింటికీ సమాధానం రాయాల్సి ఉంది.
మొత్తంగా ప్రశ్నాపత్రంలో ఇచ్చే మొత్తం సిలబస్ పరిశీలిస్తే.. 1వ యూనిట్ నుండి ఒక 2 మార్కుల ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. మొత్తం ఈ చాప్టర్ జాగ్రత్తగా చదివితే.. 6 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇలా రెండవ యూనిట్ లో ఒక 2 మార్కుల ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న, ఒక 8 మార్కుల ప్రశ్న మొత్తంగా 14 మార్కులు, మూడవ యూనిట్ లో రెండు 2 మార్కుల ప్రశ్నలు, ఒక 4 మార్కుల ప్రశ్న మొత్తంగా 8 మార్కులు, 4వ యూనిట్ లో రెండు 2 మార్కుల ప్రశ్నలు, రెండు 4 మార్కుల ప్రశ్నలు అంటే 12 మార్కులు, ఐదవ యూనిట్ నుండి రెండు 2 మార్కుల ప్రశ్నలు, ఒక 8 మార్కుల ప్రశ్న అంటే.. 12 మార్కులు, 6వ యూనిట్ లో రెండు 4 మార్కుల ప్రశ్నలు, ఒక 8 మార్కుల ప్రశ్న అంటే 16 మార్కులు, 8వ యూనిట్ లో రెండు 2 మార్కుల ప్రశ్నలు, ఒక 4 మార్కుల ప్రశ్న అంటే 8 మార్కులు వస్తాయి.
కాబట్టి, 2,4,5,6వ యూనిట్లను జాగ్రత్తగా చదివితే.. సులభంగా జువాలజీ మొదటి సంవత్సరం పేపరులో అత్యధిక మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP inter board, AP Inter Exams 2022, AP intermediate board exams, Career and Courses, Exams